అక్షరటుడే, వెబ్డెస్క్ : korutla | జగిత్యాల జిల్లా (Jagtial district) కోరుట్లలో విషాదం చోటు చేసుకుంది. వినాయక విగ్రహాల తయారీ కేంద్రం వద్ద కరెంట్ షాక్ (electric shock) తగిలి ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అల్వాల వినోద్, బంటి సాయి అనే ఇద్దరు కోరుట్ల పట్టణ శివారులో వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. అయితే షెడ్డులో ఉన్న విగ్రహాలు తడిగా ఉండటంతో ఆదివారం పక్కనే ఉన్న మరో షెడ్డులోకి మార్చాలని నిర్ణయించారు. ఈ క్రమంలో విద్యుత్ తీగలకు వినాయక విగ్రహం తగలడంతో అల్వాల వినోద్, బంటి సాయి మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.