ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Nara Lokesh | జ‌గన్‌కు కడుపు మంట‌.. రెండు ఈనో ప్యాకెట్స్ పంపిస్తాన‌న్న లోకేష్‌

    Nara Lokesh | జ‌గన్‌కు కడుపు మంట‌.. రెండు ఈనో ప్యాకెట్స్ పంపిస్తాన‌న్న లోకేష్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Nara Lokesh | ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు (Andhra Pradesh politics) ఏ విధంగా ఉన్నాయో మ‌నం చూస్తూనే ఉన్నాం. నువ్వా, నేనా అన్న‌ట్టు కూట‌మి ప్ర‌భుత్వం, వైసీపీ మాట‌ల దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే తాజాగా నారా లోకేష్ (Nara Lokesh).. జ‌గ‌న్‌పై త‌న‌దైన శైలిలో సెటైర్స్ వేశారు. ‘తల్లికి వందనం’ పథకం అద్భుత విజయం సాధించిందని, ఇది చూసి మాజీ ముఖ్యమంత్రి జగన్(former CM Jagan)కు కడుపుమంట మూడు రెట్లు పెరిగిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వ్యంగ్యంగా కామెంట్ చేశారు.. అందుకే, ఈ పథకం అమలు తీరుపై జగన్ రెడ్డి తన పత్రిక ద్వారా మరోసారి అసత్య ప్రచారానికి తెరలేపారని ఆరోపించారు.

    Nara Lokesh | తల్లుల కళ్లలో ఆనందం చూసి..

    త‌ల్లుల క‌ళ్ల‌లో ఆనందం చూసి జగన్ రెడ్డి (Jagan Reddy) కడుపు మంట మూడింతలు పెరిగింది. మరోసారి తన విష పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారు. ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు, లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదు. గ్రామ సచివాలయం, లేదా వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తరువాత మాత్రమే వారికి నిధులు విడుదల అవుతాయని నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. ‘దొంగ లెక్కలు, డబ్బులు కొట్టేయడం మీ బ్రాండ్ జగన్ రెడ్డి. మీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలే అందరూ చేస్తారు అనుకుంటే ఎలా చెప్పండి ? మాది ప్రజా ప్రభుత్వం (public government) తప్పు చెయ్యం.. చెయ్యనివ్వం. జగన్ రెడ్డి కడుపు మంటగా ఉన్నట్టుంది.. రెండు ఈనో ప్యాకెట్లు పంపిస్తాను వాడండి.. కాస్త తగ్గుద్ది’ అంటూ ఎద్దేవా చేశారు.

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు డబ్బులు అకౌంట్‌లో జమ చేశారు. అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బుల్ని కొందరికి మాత్రం జులై నెలలో జమ చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరానికి (2025-26) సంబంధించి ఒకటో తరగతి, ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌లో చేరే విద్యార్థులకు ప్రస్తుతం డబ్బులు జమ చేయలేదు. ఏపీ ప్రభుత్వం (Ap Government).. వీరందరికి జులై 5న తల్లికి వందనం నిధులను అకౌంట్‌లలో జమ చేయనుంది. ఎందుకంటే ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల (intermediate first-tier admissions) వివరాలు వచ్చేందుకు కొంత సమయం పడుతుంది. అందుకే వీరికి జులై 5న జమ చేయాలని నిర్ణయించింది. 2025-26 విద్యా సంవత్సరం ప్రామాణికంగా ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...