అక్షరటుడే, కామారెడ్డి: Alumni Students | కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ జూనియర్ కళాశాలలో చదువుకున్న 1999-2001 బ్యాచ్ ఇంటర్మీడియట్ బైపీసీ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. 25 ఏళ్ల తర్వాత ఒక్క చోట చేరి ఆనందంగా గడిపారు. నాటి కళాశాల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బిజీ షెడ్యూల్లో పాతికేళ్ల తర్వాత కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇకపై ఇదే ఒరవడి కనబరుస్తూ ప్రతి సవత్సరం కలుసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
