ePaper
More
    HomeజాతీయంBridge Collapse | దేశంలో మరో ఘోర ప్రమాదం.. వంతెన కూలి ఆరుగురు మృతి

    Bridge Collapse | దేశంలో మరో ఘోర ప్రమాదం.. వంతెన కూలి ఆరుగురు మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bridge Collapse | అహ్మ‌దాబాద్ ఎయిర్‌పోర్ట్ (Ahmedabad Airport) స‌మీపంలో విమానం కూలి (helicopter crashe) 241 మంది మరణించిన ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ఇంకా ఈ ఘటనను మరిచిపోకముందే దేశంలో మరో దుర్ఘటన చోటు చేసుకుంది.

    మహారాష్ట్ర పుణే జిల్లాలోని (Maharashtra, Pune district) పింప్రి-చించ్వాడ్‌ పీఎస్‌ పరిధిలోని కుందమలలో ఇంద్రయాణి నదిపై ఉన్న వంతెన ఆదివారం కూలిపోయింది. ఈ ఘటనలో 20 నుంచి 25 మంది వరకు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లుగా స్థానిక ఎమ్మెల్యే సునీల్‌ షుల్కే మీడియాకు తెలిపారు.

    Bridge Collapse | మ‌రో విషాదం..

    ఆదివారం మధ్యాహ్నం సమయంలో వంతెన (Bridge) ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రస్తుతం గల్లంతయిన‌ వారి కోసం గాలిస్తున్నారు. పర్యాటక ప్రాంతమైన కుందమలకు నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇంద్రయాని నదిని (Indrayani River) దాటేందుకు అప్పట్లో వంతెనను నిర్మించారు. ఇటీవల రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వంతెన దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. వంతెన కూలిపోవడాన్ని గమనించిన కొంతమంది స్థానికులు వెంటనే స్పందించి పోలీసులు, రవాణా శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రెస్క్యూ టీమ్‌లు (Rescue teams) సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించాయి. సదరు వంతెన నిర్మించి దాదాపు 100 ఏళ్లకు పైగా అయ్యిందని సమాచారం.

    వంతెన కూలిపోవడంతో పర్యాటకులు కొంద‌రు నదిలో పడి కొట్టుకుపోయారు. ప్రస్తుతం వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ (rescue operation) చేపట్టారు. ఇప్పటి వరకు ఆరుగురిని రక్షించారు. కాగా.. ఈ ఘటనలో ఎంత మంది కొట్టుకుపోయారన్న విషయంలో స్పష్టత లేదని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, 20-25 మంది వరకు గల్లంతై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

    ఈ ఘటనపై ఎమ్మెల్యే సునీల్‌ (MLA Sunil) మాట్లాడుతూ.. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయని చెప్పారు. అంబులెన్స్‌లను సంఘటనా స్థలంలో మోహరించామని.. పర్యాటకులను కాపాడేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. “ప్రమాదం అనంతరం ప్రజల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. ఇది చాలా పాత వంతెన. పదేపదే అధికారులకు చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదు” అంటూ స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...