ePaper
More
    Homeఅంతర్జాతీయంIsrael | ఇజ్రాయెల్​ ప్రధాని కొడుకు పెళ్లి వాయిదా.. ఎందుకో తెలుసా..

    Israel | ఇజ్రాయెల్​ ప్రధాని కొడుకు పెళ్లి వాయిదా.. ఎందుకో తెలుసా..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Israel | ఇరాన్​– ఇజ్రాయెల్​ (Iran-Israel) మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇరాన్​ అణుశక్తి గల దేశంగా మారితే తమ ఉనికికే ప్రమాదం అని భావించిన ఇజ్రాయెల్​ ఆపరేషన్​ ‘రైజింగ్​ లయన్’ (Operatin Rising Lion)​ పేరిట దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.

    100కు పైగా యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్​ ఇరాన్​పై విరుచుకుపడింది. ఆ దేశంలోని అణు స్థావరాలు, ఆర్మీ కీలక నేతలు, న్యూక్లియర్​ సైంటిస్టులే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. ఈ క్రమంలో ఇరాన్​ కూడా ప్రతిదాడులకు దిగింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్​ ప్రధాని నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో తన కుమారుడి వివాహాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

    Israel | విమర్శలు రావడంతో..

    ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కుమారుడు అవ్‌నర్‌, అమిత్‌ యార్దేనీకి సోమవారం వివాహం జరగాల్సి ఉంది. అయితే దేశం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ప్రధాని ఇంట్లో పెళ్లి ఏమిటని విమర్శలు వచ్చాయి. గాజాపై ఇజ్రాయెల్​ దాడుల సమయం నుంచే ఈ విమర్శలు ఉన్నాయి. గాజాలో ఐడీఎఫ్​ దళాలు పోరాడుతుంటే.. ప్రధాని ఇంట పెళ్లి వేడుకలు ఏమిటని గతంలో సైతం పలు విమర్శలు చేశాయి. తాజాగా ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇవి మరింత ఎక్కువ అయ్యాయి. దీంతో ప్రధాని తన కుమారుడి వివాహాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

    Israel | ఇరాన్​ ప్రతిదాడులు

    ఇజ్రాయెల్​ తమ దేశంపై దాడి చేయడంతో ఇరాన్​ తీవ్రంగా స్పందించింది. ఆ దేశం వందల కొద్ది డ్రోన్లు, మిసైళ్లతో ఇజ్రాయెల్​పై విరుచుకుపడింది. ఆపరేషన్​ ట్రూ ప్రామిస్​ 3 (True Promise 3) పేరిట దాడులు చేపట్టింది. కాగా.. ఇరాన్​ ప్రయోగించిన పలు డ్రోన్ల, క్షిపణులను ఇజ్రాయెల్ ఐరన్​ డోమ్​ వ్యవస్థ మధ్యలోనే అడ్డుకుంది. కొన్ని మాత్రం పలు ప్రాంతాల్లో పడడంతో పలువురు మృతి చెందారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్​ దాడుల్లో ఆదివారం 10 మంది మరణించారని, 180 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్​ పోలీసులు తెలిపారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...