ePaper
More
    HomeతెలంగాణMP Arvind | ఫోన్​ ట్యాపింగ్​పై కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలి : ఎంపీ అర్వింద్​

    MP Arvind | ఫోన్​ ట్యాపింగ్​పై కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలి : ఎంపీ అర్వింద్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Arvind | ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​(MP Dharmapuri Arvind) డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్​ వేదికగా పోస్ట్​ పెట్టారు. దుబ్బాక, హుజురాబాద్​ ఉప ఎన్నికల సమయంలో ఎంపీ అర్వింద్​తో పాటు, బీజేపీ నేత జితేందర్​రెడ్డి (Jitender Reddy) ఫోన్లు ట్యాప్​ చేసినట్లు ఫోరెన్సిక్​ సైన్స్​ ల్యాబోరేటరీ(FSL) రిపోర్ట్​ పేర్కొంది. అంతేగాకుండా వాళ్ల అనుచరులకు చెందిన 200 మంది ఫోన్లు కూడా ట్యాప్​ చేశారని ఎఫ్​ఎస్​ఎల్ తెలిపింది.

    ఎఫ్​ఎస్​ఎల్​ నివేదికపై (FSL report) స్పందిస్తూ ఎంపీ అర్వింద్​ కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేపట్టాలన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు కిషన్​రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్​ను (Bandi Sanjay) కోరారు. ఈ విషయమై తాను లోక్‌సభ స్పీకర్, కేంద్ర హోం మంత్రికి కూడా లేఖ రాస్తానని వెల్లడించారు.

    MP Arvind | సీఎంపై సంచలన వ్యాఖ్యలు

    ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో (phone tapping case) రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశం లేదని ఎంపీ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి (Revanth Reddy) కేసీఆర్ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. దీంతో ఈ కేసులో నేరస్తులపై చర్యలు తీసుకునే అవకాశం చాలా తక్కువ అన్నారు. అందుకే కేంద్ర సంస్థతో విచారణ చేపట్టి నిందితులను శిక్షించాలని డిమాండ్​ చేశారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...