ePaper
More
    HomeతెలంగాణRythu Bharosa | రైతులకు గుడ్​న్యూస్​.. రైతుభరోసా, బోనస్​పై కీలక ప్రకటన

    Rythu Bharosa | రైతులకు గుడ్​న్యూస్​.. రైతుభరోసా, బోనస్​పై కీలక ప్రకటన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rythu Bharosa | వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులకు (Farmers) ప్రభుత్వం గుడ్​న్యూస్​ చెప్పింది. వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో రైతు భరోసా (Rythu Bharosa) జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Tummala Nageswara Rao) తెలిపారు. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్​ విడుదల అవుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.

    Rythu Bharosa | బోనస్​ కూడా..

    రైతు భరోసాతో పాటు యాసంగి సీజన్​కు సంబంధించి సన్నాలకు బోనస్ (Bonus)​ కూడా జమ చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. వానాకాలం సీజన్​లో కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యం విక్రయించిన రైతులకు క్వింటాలు​కు రూ.500 చొప్పున ప్రభుత్వం బోనస్​ చెల్లించింది. దీంతో యాసంగిలో ఎక్కువ మంది రైతులు సన్నరకం ధాన్యం సాగు చేశారు. అయితే కొనుగోలు కేంద్రాల ధాన్యం సేకరించిన ప్రభుత్వం ఇప్పటి వరకు బోనస్​ డబ్బులు చెల్లించలేదు. దీంతో రైతులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో వారం రోజుల్లో రైతు భరోసాతో పాటు బోనస్​ కూడా చెల్లిస్తామని మంత్రి చెప్పడం గమనార్హం.

    Rythu Bharosa | ఎన్నికల నేపథ్యంలో..

    రాష్ట్రంలో ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నిల (Local Body Elections)కు షెడ్యూల్​ విడుదల అవుతుందని మంత్రులు పేర్కొన్నారు. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల కోడ్​ రాకముందే రైతు భరోసా, బోనస్​ చెల్లించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. బోనస్​, రైతు భరోసా, స్థానిక ఎన్నికలపై సోమవారం కేబినెట్​ మీటింగ్​లో చర్చించనున్నారు. అనంతరం పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.

    Rythu Bharosa | జోరుగా సాగు పనులు

    ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. దీంతో రైతులు సాగు పనుల్లో బిజీగా ఉన్నారు. మరో 15 రోజుల్లో వరినాట్లు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పెట్టుబడి సాయం కోసం అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం (Government) సకాలంలో డబ్బులు విడుదల చేస్తే పెట్టుబడికి ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు.

    Rythu Bharosa | ముందు వారికే..

    రైతు భరోసాకు నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆర్​బీఐ నుంచి అప్పు తీసుకున్న ప్రభుత్వం.. మరో రూ.మూడు వేల కోసం ఇండెంట్​ పెట్టింది. ఈ క్రమంలో రైతు భరోసా జమ చేయడానికి ఆర్థిక శాఖ (Finance Department) సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ముందుగా ఎకరాలోపు రైతులకు నిధులు జమ చేయనున్నారు. అనంతరం రెండు, మూడు ఎకరాలలోపు రైతులకు విడతల వారీగా రైతు భరోసా జమ చేయనున్నారు.

    Rythu Bharosa | వారి పరిస్థితి ఏమిటి?

    ప్రభుత్వం యాసంగి సీజన్​లో రైతు బంధును రైతు భరోసాగా మార్చింది. ఎకరాకు గతంలో రూ.5వేలు ఇస్తుండగా రూ.ఆరు వేలకు పెంచింది. అయితే యాసంగి సీజన్​లో నాలుగు ఎకరాల్లోపు రైతులకు మాత్రమే రైతు భరోసా జమ అయింది. మిగతా వారికి నిధులు జమ చేయలేదు. యాసంగి సీజన్​లో 57 లక్షల రైతులకు 84 లక్షల ఎకరాలకు సంబంధించి రూ.5,058 కోట్లను పంపిణీ చేసింది. బీఆర్ఎస్​ హయాంలో ఎకరాకు రూ.5 వేల చొప్పున సీజన్​కు రూ.7,500 కోట్లు రైతుబంధు ఇచ్చేవారు. కాంగ్రెస్​ మాత్రం సాయాన్ని పెంచిన రూ.5,058 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో వేసింది. దీంతో డబ్బులు జమకాని రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సీజన్​ రైతు భరోసాకు విడుదలకు ప్రభుత్వం సిద్ధం అవుతుండడంతో ముందుగా తమకు నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...