ePaper
More
    HomeజాతీయంBalochistan | పాకిస్తాన్​కు మరో షాక్​.. గ్యాస్​ పైప్​లైన్​ ధ్వంసం చేసిన బీఆర్​ఏ

    Balochistan | పాకిస్తాన్​కు మరో షాక్​.. గ్యాస్​ పైప్​లైన్​ ధ్వంసం చేసిన బీఆర్​ఏ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Balochistan | ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్​(Pakistan)కు మరో షాక్ తగిలింది. ఐఎంఎఫ్​, ప్రపంచ బ్యాంక్​ అప్పు ఇస్తే గాని పూట గడవని స్థితిలో ఉన్న దాయాది దేశానికి బలూచిస్తాన్(Balochistan) వేర్పాటువాదులు చుక్కలు చూపిస్తున్నారు. ఇటీవల భారత్​ చేపట్టిన ఆపరేషన్​ సిందూర్​తో పాకిస్తాన్​ తీవ్రంగా నష్టపోయింది. అనంతరం బలూచ్​ లిబరేషన్​ ఆర్మీ(BLA) బలూచిస్తాన్​లోని కీలక నగరాలను స్వాధీనం చేసుకుంది. అంతేగాకుండా పాకిస్తాన్​ సైనికులే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. అయితే తాజాగా బలూచ్​ రిపబ్లిక్​ ఆర్మీ(Baloch Republic Army) పాకిస్తాన్​లోని కీలకమైన గ్యాస్​ పైప్​లైన్​ను ధ్వంసం చేసింది.

    Balochistan | ప్రతీకారంగా..

    సుయి గ్యాస్ క్షేత్రాల నుంచి కరాచీకి గ్యాస్ రవాణా చేసే 36 అంగుళాల వ్యాసం కలిగిన గ్యాస్ పైప్‌లైన్‌(Gas pipeline)ను బీఆర్​ఏ ధ్వంసం చేసింది. BRA ప్రతినిధి సర్బాజ్ బలూచ్ మాట్లాడుతూ.. బలూచ్ యోధులు సుయి తెహసిల్‌లోని దొండై ప్రాంతంలోని పైప్‌లైన్‌ను పేలుడు పదార్థాలను ఉపయోగించి పేల్చేశారని తెలిపారు. ఈ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అంతేగాకుండా గ్యాస్​ సరఫరాకు అంతరాయం కలిగింది.

    పాకిస్తాన్ దళాలు ఇటీవల నిరాయుధులైన బలూచ్ యువకులను చంపినందుకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు బీఆర్​ఏ ప్రకటించింది. BRA అధికారికంగా ఈ ఆపరేషన్‌కు బాధ్యత వహించింది. బలూచ్ వనరుల దోపిడీ, బలూచిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

    Balochistan | బీఆర్​ఏ అంటే ఏమిటీ

    బలూచ్ రిపబ్లికన్ ఆర్మీ పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఉన్న ఒక సాయుధ ఉగ్రవాద సంస్థ. సెప్టెంబర్ 2010లో పాకిస్తాన్ ప్రభుత్వం(Pakistan Government) బలూచ్ రిపబ్లికన్ ఆర్మీని నిషేధించింది. కాగా బలూచ్​ లిబరేషన్​ ఆర్మీ(BLA) లాగే ఈ సంస్థ కూడా బలూచ్​ వనరుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. 2006లో డేరా బుగ్తిలో సైనిక చర్య జరిపి పాక్​ బలూచ్ నాయకుడు నవాబ్ అక్బర్ బుగ్తి(Nawab Akbar Bugti)ని హత మార్చింది. ఈ ఘటన అనంతరం బలూచ్ రిపబ్లికన్ ఆర్మీ ఏర్పడింది. మొదట్లో ఈ సంస్థలో బుగ్తి గిరిజనులు చేరారు. కానీ అనంతరం బలూచ్ విద్యార్థులు(Baloch students), యువకులు చేరడంతో పెద్దదిగా మారింది.

    More like this

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...