ePaper
More
    HomeతెలంగాణHyderabad | తెగిపడిన విద్యుత్​ తీగ.. ఫుట్​పాత్​పై నిద్రిస్తున్న ఇద్దరి మృతి

    Hyderabad | తెగిపడిన విద్యుత్​ తీగ.. ఫుట్​పాత్​పై నిద్రిస్తున్న ఇద్దరి మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | ఫుట్​పాత్(foot path)​పై నిద్రిస్తున్న ఇద్దరిని విద్యుత్​ తీగ బలిగొంది. ప్రశాంతంగా పడుకున్న వారిపై కరెంట్​ వైర్​ తెగిపడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన హైదరాబాద్​లోని ఎల్బీ నగర్​(LB Nagar) పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

    ఎల్బీ నగర్​ పరిధిలోని చింతలకుంట(Chintalakunta) రోడ్డు సాగర్ ​రిండ్​ రోడ్డు వద్ద ఎల్లమతల్లి ఆలయం సమీపంలో ఇద్దరు ఫుట్​పాత్​పై నిద్రిస్తున్నారు. ఒక మహిళ, ఒక పురుషుడు పడుకొని ఉండగా.. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో విద్యుత్​ తీగ తెగి వారిపై పడింది. దీంతో విద్యుత్​ షాక్​ తో వారు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ(osmaniya hospital mortuary)కి తరలించారు. వారి వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, యాచకులు అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    stone quarry explosion | రాతి క్వారీలో ఘోరం.. భారీ పేలుడు.. ఆరుగురు కార్మికుల దుర్మరణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: stone quarry explosion : పశ్చిమ బెంగాల్‌ West Bengal లో ఘోర ప్రమాదం సంభవించింది....

    Karnataka Fatal accident | కర్ణాటకలో ఘోర ప్రమాదం.. భక్తులపైకి దూసుకెళ్లిన కంటైనర్.. ఎనిమిది మంది దుర్మరణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Karnataka Fatal accident : కర్ణాటక Karnataka లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ...

    He married hijra | హిజ్రాను ప్రేమించాడు.. పెళ్లి కూడా చేసుకున్నాడు.. ఎక్కడంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: He married hijra | ఆ యువకుడు సాధారణ ఉద్యోగి.. తన తోటి ఉద్యోగుల్లో ఒకరు...