ePaper
More
    Homeఅంతర్జాతీయంUS Army Day | యూఎస్​ ఆర్మీ డే వేడుకలు.. పాక్​ ఆర్మీ చీఫ్​ను ఆహ్వానించలేదని...

    US Army Day | యూఎస్​ ఆర్మీ డే వేడుకలు.. పాక్​ ఆర్మీ చీఫ్​ను ఆహ్వానించలేదని ప్రకటన

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: US Army Day : పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్(Pakistan Army Chief General Asim Munir) సహా ఏ విదేశీ సైనిక నాయకులను అమెరికా సాయుధ దళాల(US Armed Forces) 250వ వార్షికోత్సవ వేడుకలకు ఆహ్వానించలేదని వైట్ హౌస్ (White House) స్పష్టం చేసింది. “వేడుకలకు విదేశీ సైనిక నాయకులను ఆహ్వానించలేదు” అని వైట్ హౌస్ అధికారి ఒకరు దక్షిణాసియా మీడియా సంస్థలకు వెల్లడించారు.

    జూన్ 14న వాషింగ్టన్(Washington), డీసీ(DC)లో జరగనున్న ఈ కవాతులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) 79వ పుట్టినరోజు వేడుకలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్యాంకులు, సంగీత ప్రదర్శనలు, వైమానిక ప్రదర్శనలు, బాణసంచా ప్రదర్శనలు చేపడతారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ వేడుకలు కొనసాగాయి. రాత్రిపూట కచేరీ జరిగింది.

    యూఎస్US నుంచి మునీర్ కు అధికారిక ఆహ్వానం అందిందని దక్షిణాసియాకు చెందిన అనేక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ వార్తలపై భారత విశ్లేషకులు, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందించాయి. ఈ ఆహ్వానం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) ప్రభుత్వానికి దౌత్యపరంగా ఇబ్బందికరమైనదని భారత ప్రతిపక్ష నాయకులు అభివర్ణించారు. RAND కార్పొరేషన్‌లో సీనియర్ రక్షణ విశ్లేషకుడు డెరెక్ గ్రాస్‌మన్, ఈ ఆహ్వానాన్ని భారతదేశానికి “దౌత్యపరమైన ఎదురుదెబ్బ”గా అభివర్ణించారు. ఇది పాకిస్తాన్ సైనిక నాయకత్వాన్ని చట్టబద్ధం చేస్తున్నట్లుగా భావించవచ్చని హెచ్చరించారు.

    కానీ, ఈ పుకార్లన్నింటిని పటాపంచలు చేస్తూ.. యూఎస్ వైట్​ హౌస్​ ప్రకటన విడుదల చేసింది. అసలు పాక్​ ఆర్మీ చీఫ్ నే కాదు, తాము ఏ దేశ సైనికాధికారిని ఆహ్వానించలేదని ప్రకటించింది.

    US Army Day : భారత్​తో వ్యూహాత్మక సంబంధాలు..

    దౌత్యపరమైన గందరగోళం మధ్య, అమెరికా సీనియర్ అధికారులు భారత్​కు బలమైన మద్దతును పునరుద్ఘాటించారు. విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్(Tammy Bruce) మాట్లాడుతూ.. డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ లాండౌ(Deputy Secretary of State Christopher Landau).. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్(Congress MP Shashi Tharoor) నేతృత్వంలోని భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందాన్ని కలిశారని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అమెరికా-భారత్​ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించారని పేర్కొన్నారు.

    యూఎస్ సెంట్‌కామ్ చీఫ్ జనరల్ మైఖేల్ కురిల్లా మాట్లాడుతూ.. భారత్​(India), పాకిస్తాన్(Pakistan) రెండింటితో భద్రతా సంబంధాలను కొనసాగించాల్సిన ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు. 2021 కాబూల్ విమానాశ్రయ(Kabul airport) బాంబు దాడిలో పాల్గొన్న ISIS-K కార్యకర్త మహ్మద్ షరీఫుల్లాను అరెస్టు చేయడంలో పాకిస్తాన్ పాత్రను ఆయన గుర్తుచేశారు. పాకిస్తాన్‌తో అమెరికా దోస్తాని.. భారత్​తో సంబంధాలను దెబ్బతీయదని చెప్పుకొచ్చారు.

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...