ePaper
More
    Homeక్రీడలుCricket New Catching Rule | కొత్త క్యాచింగ్ రూల్.. బౌండ‌రీ లైన్‌లో అలా క్యాచ్...

    Cricket New Catching Rule | కొత్త క్యాచింగ్ రూల్.. బౌండ‌రీ లైన్‌లో అలా క్యాచ్ ప‌డితే నాటౌట్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Cricket New Catching Rule | మెరిల్​బోర్న్ క్రికెట్ క్లబ్ (MCC) ఇప్పుడు క్రికెట్​లో కొత్త నిబంధన తీసుకురానునుంది.

    బౌండరీ లైన్ (boundary line) వద్ద ఫీల్డర్లు అందుకునే క్యాచ్​ల్లో కీలక మార్పు చేసింది. ఈ కొత్త నిబంధనను ఇదే నెలలోనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ రూల్స్​లో (International Cricket Council rules) చేర్చనుంది. అయితే ఇది 2026 అక్టోబర్​లో అమల్లోకి రానున్నట్లు ఎమ్​సీసీ పేర్కొంది. బౌండ‌రీ లైన్ ద‌గ్గ‌ర క్యాచ్‌ల‌ విష‌యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (International Cricket Council), మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)లు కొత్త రూల్స్‌ను తీసుకురానున్న‌ట్లు స‌మాచారం. బౌండ‌రీ లైన్ దాటి వెళ్లి బంతిని పుష్ చేస్తూ ప‌ట్టే బ‌న్నీ హాఫ్ క్యాచ్‌లు ఇక నుంచి చెల్ల‌వు అని చెప్పుకొచ్చారు. అయితే.. బౌండ‌రీ లోప‌ల నుంచి బంతిని నెట్టి, ఆపై బ‌య‌టికి వెళ్లి, తిరిగి డైవ్ చేసి క్యాచ్‌ను అందుకుంటే మాత్రం దాన్ని క్యాచ్‌గానే ప‌రిగ‌ణించ‌నున్నారు.

    Cricket New Catching Rule | ఇక నుండి అలా చేయాలి..

    ఊదాహ‌ర‌ణ‌కు.. 2023లో బిగ్‌బాష్ లీగ్‌లో (Big Bash League) మైఖేల్ నేస‌ర్‌.. బౌండ‌రీ లైన్ వ‌ద్ద క్యాచ్ అందుకున్నాడు. అయితే.. బ్యాలెన్స్ కోల్పోతుండ‌డంతో బంతిని గాల్లోకి ఎగ‌ర‌వేశాడు. ఆపై అత‌డు బౌండ‌రీ లైన్ దాటి వెళ్లాడు. అక్క‌డ గాల్లోకి ఎగిరి బంతిని అందుకుని మ‌రోసారి గ్రౌండ్‌లోకి నెట్టాడు. ఆపై మైదానంలోకి జంప్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. దీంతో బ్యాట‌ర్ ఔట్ (Batter out) అయ్యాడు. ఈ క్యాచ్ పై అప్ప‌ట్లో తీవ్ర దుమారం రేగింది.

    ఈ క్ర‌మంలోనే ఎంసీసీ బ‌న్నీ హాప్స్ క్యాచ్‌ను ఇల్లీగ‌ల్‌గా ప్ర‌క‌టించారు. కాగా.. బౌండరీ లోపల నుంచి బంతిని పైకి నెట్టి, బయటికి వెళ్లి, ఆపై డైవ్ చేసి క్యాచ్ పట్టేందుకు అనుమతి ఉంది. ఉదాహ‌ర‌ణ‌కు హార్లీన్ డియోల్ ప‌ట్టిన‌ట్లుగా ప‌డితే అది క్యాచ్ కింద‌నే ప‌రిగ‌ణిస్తారు.

    ఫీల్డర్ బౌండరీ లైన్ (Boundary line) బయటకు వెళ్లి గాల్లో బంతి అందుకుంటే, ఒకే ప్రయత్నంలో దాన్ని తిరిగి లోపలికి విసరాలి. ఇలా విసిరిన బంతిని వెంటనే లైన్ లోపలికి వచ్చి పట్టుకోవాలి. అప్పుడే అది క్యాచౌట్​గా పరిగణిస్తారు. ఒకవేళ బౌండరీ లైన్ బయట నుంచి బంతిని రెండుసార్లు గాల్లోకి విసిరితే (ఆ సమయంలో ఫీల్డర్ గాల్లోనే ఉన్నా) అది సిక్స్​గానే పరిగణిస్తారు. అంటే బౌండరీ లైన్ బయట ఫీల్డర్, బంతిని ఒకేసారి తాకాలి అన్నమాట. రెండుసార్లు గాల్లోకి ఎగురవేయడం ఇకపై కుదరదు. ఈ కొత్త రూల్ ఈ నెలలోనే ఐసీసీ ప్లేయింగ్ కండిషన్‌లో భాగం కానుంది.

    More like this

    Ramareddy mandal | యూరియా కోసం రైతుల బారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Ramareddy mandal | రామారెడ్డి మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం (society office) వద్ద యూరియా...

    Ex Mla Jajala Surendar | రైతులను ఆదుకోకుంటే బీసీ సభను అడ్డుకుంటాం

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ex Mla Jajala Surendar | ఇటీవలి భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని...

    Chakali Ailamma | పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ సేవలు మరువలేం..

    అక్షరటుడే, ఇందూరు: Chakali Ailamma | నగరంలోని బోర్గాం(పి) చౌరస్తా వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం...