Community Contact Program
Community Contact Program | శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు

అక్షరటుడే, బోధన్​: Community Contact Program | శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బోధన్​ ఏసీపీ శ్రీనివాస్ (Bodhan ACP Srinivas)​ అన్నారు. సాలూర మండల కేంద్రంలో శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్​ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్రువపత్రాలు లేని సుమారు 70 వాహనాలను సీజ్​ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడారు. హెల్మెట్​ లేకుండా వాహనాలు నడపవద్దన్నారు. మైనర్లు వాహనాలు (Minor driving) నడిపితే వారి తల్లిదండ్రులకు జరిమానాలు వేస్తామని.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో బోధన్​ టౌన్​, రూరల్​ సీఐలు వెంకట్​ నారాయణ (CI Venkat Narayana), విజయ్​బాబు(CI vijay Babu), రూరల్​ ఎస్సై మచ్చేందర్​ తదితరులు పాల్గొన్నారు.