ePaper
More
    HomeFeaturesShamshabad Airport | ఎయిర్​పోర్టులో దెయ్యాలు.. అసలు విషయం ఏంటంటే?

    Shamshabad Airport | ఎయిర్​పోర్టులో దెయ్యాలు.. అసలు విషయం ఏంటంటే?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Shamshabad Airport | హైదరాబాద్​ (Hyderabad)లోని రాజీవ్​గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. దేశంలోని కీలక ఎయిర్​పోర్టులలో ఇది ఒకటి. శంషాబాద్​లో ఉన్న ఈ విమానాశ్రయంపై ఇటీవల సోషల్​ మీడియా (Social Media)లో రుమార్లు వినిపించాయి. ఎయిర్​పోర్టులో అతీంద్రియ కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రచారం జరిగింది. దీనిపై విమానాశ్రయ అధికారులు స్పందించారు. ఆ రుమార్లను కొట్టిపారేశారు.

    Shamshabad Airport | అసలు ఏం జరిగిందంటే..

    హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) అతీంద్రియ కార్యకలాపాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ఇటీవల వైరల్​ అయింది. ఎయిర్​ పోర్ట్​ నిర్మాణ సమయంలో సమాధులను సరిగ్గా తరలించకపోవడంతో ఆత్మలు టెర్మినల్‌ (Terminal)ను వెంటాడతాయని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అయింది. అనంతరం పుకార్లు ప్రారంభమయ్యాయి. దీంతో పలువురు ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అసలే అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో ఆందోళనలో ఉన్న ప్రయాణికులను ఈ పుకార్లు మరింత భయపెట్టాయి.

    ఈ పుకార్లపై తాజాగా RGIA అధికారులు స్పందించారు. ఈ వాదనలు అబద్దం అని కొట్టి పారేశారు. తప్పుదారి పట్టించేవి, కల్పిత కంటెంట్ ఆధారంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మి ఆందోళన చెందొద్దని ప్రయాణికులను కోరారు. అలాగే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, సోషల్​ మీడియాలో వచ్చే ప్రతి విషయాన్ని నమ్మొద్దని సూచించారు.

    కాగా ఎయిర్​పోర్టులో ఆత్మలు ఉన్నాయంటూ సోషల్​ మీడియాలో వచ్చిన పోస్టులపై నెటిజన్లు సైతం మండిపడుతున్నారు. ఈ కాలంలో దెయ్యాలెంటి బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు. వ్యూస్​ కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే వీడియోలు చేయొద్దని హితవు పలికారు. ఇలా తప్పుడు వీడియోలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...