అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | మండలంలోని సంగారెడ్డి-నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఎస్సై శివకుమార్ (Si Shiva kumar ) ఆధ్వర్యంలో పెండింగ్ చలాన్ల వసూలుతో పాటు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు జరిమానాలు విధించారు. అలాగే డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు (Drunk drive test) నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
