ePaper
More
    HomeజాతీయంHelicopter Manufacturing Center | నాగ్‌పూర్‌లో అత్యాధునిక హెలికాప్టర్ తయారీ కేంద్రం.. మాక్స్ ఏరోస్పేస్తో ‘మహా’...

    Helicopter Manufacturing Center | నాగ్‌పూర్‌లో అత్యాధునిక హెలికాప్టర్ తయారీ కేంద్రం.. మాక్స్ ఏరోస్పేస్తో ‘మహా’ సర్కారు ఒప్పందం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Helicopter manufacturing center | రక్షణ రంగంలో భారత్ స్వావలంబన దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా నాగ్‌పూర్‌లో అత్యాధునిక హెలికాప్టర్ తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ మేరకు మాక్స్ ఏరోస్పేస్ & ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్, మహారాష్ట్ర ప్రభుత్వంతో (Maharashtra government) ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసింది. రాబోయే ఎనిమిది సంవత్సరాలలో రూ. 8,000 కోట్ల పెట్టుబడితో ఇక్కడ హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని (Helicopter manufacturing center) ప్రారంభించనున్నారు. వెనుకబడిన విదర్భ ప్రాంతంలో 2026లో ఏర్పాటు కానున్న ఈ సంస్థ వల్ల ప్రత్యక్షంగా 2 వేల మందికి, పరోక్షంగా మరింత మందికి ఉపాధి లభిచనుంది.

    Helicopter manufacturing center | ఏరో స్పేస్ హబ్గా..

    ముంబైలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Chief Minister Devendra Fadnavis) సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై పరిశ్రమల శాఖ కార్యదర్శి పి. అన్బలగన్ (Industries Secretary P. Anbalagan), మాక్స్ ఏరోస్పేస్ చైర్మన్ భరత్ మల్కాని సంతకం చేశారు. MIDC CEO పి. వెల్రాసు, మాక్స్ ఏరోస్పేస్ CFO కిరిత్ మెహతా, బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ మేఘనా మల్కాని, అధ్యక్షుడు జయేష్ మెహతా తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు మహారాష్ట్ర ఏరోస్పేస్ హబ్గా (aerospace hub) మారే ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని సీఎం ఫడ్నవిస్ (CM Devendra Fadnavis) అభివర్ణించారు.. “ఇది నాగ్పూర్లో మాత్రమే కాదు, భారతదేశ వ్యూహాత్మక సామర్థ్యాలలో పెట్టుబడి. ఈ వెంచర్ను విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని” అని ముఖ్యమంత్రి అన్నారు.. రక్షణ రంగంలో స్వావలంబనను మరింత పెంచే ‘మేక్ ఇన్ ఇండియా’ (Make in India), ‘ఆత్మనిర్భర్ భారత్’ జాతీయ దృక్పథానికి ఇటువంటి కార్యక్రమాలు కీలకమైనవని ఆయన పేర్కొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...