ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​IAS Rajiv gandhi Hanumanthu | అందరి సహకారంతో జిల్లాను ముందంజలో ఉంచాం

    IAS Rajiv gandhi Hanumanthu | అందరి సహకారంతో జిల్లాను ముందంజలో ఉంచాం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: IAS Rajiv gandhi Hanumanthu | అందరి సహకారంతో నిజామాబాద్​ జిల్లాను రాష్ట్రంలో ముందంజలో ఉంచామని బదిలీ అయిన కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్​లో ఆయనకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. అలాగే నూతన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి (Collector Vinay Krishna Reddy) స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు.

    IAS Rajiv gandhi Hanumanthu | ధాన్యం సేకరణలో జిల్లా నంబర్​వన్​..

    ఈ సందర్భంగా ఐఏఎస్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కిందిస్థాయి ఉద్యోగి మొదలుకొని ప్రతి శాఖ అధికారులు ఎంతగానో సహకరించారన్నారు. అందరి సహకారంతోనే ధాన్యం సేకరణ తదితర అంశాల్లో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు.

    IAS Rajiv gandhi Hanumanthu | జిల్లా ప్రజలు ఎంతో మంచివారు..

    వరుసగా వచ్చిన శాసనసభ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సమర్ధవంతంగా నిర్వహించామని రాజీవ్​గాంధీ హనుమంతు పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఎంతో మంచి వారని, అన్ని వర్గాల వారు అందించిన సహకారంతోనే ప్రగతి దిశలో జిల్లా సాగుతుందన్నారు.

    భవిష్యత్తులో కూడా నంబర్​వన్​గా నిలుపుతాం.. కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి..

    అనంతరం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. బదిలీపై వెళ్తున్న రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా కలెక్టర్​గా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారన్నారు. అదే దిశగా ముందుకు సాగుతూ జిల్లాను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిపేలా కృషి చేస్తానని తెలిపారు. తాను ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మెలుగుతానని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల లక్ష్యసాధనకు సమిష్టిగా కృషి చేద్దామని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya), అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Bodhan Sub-Collector Vikas Mahato), ఆర్డీవోలు రాజేంద్ర కుమార్, రాజా గౌడ్ తదితరులు ఐఏఎస్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తో కలిసి పనిచేసిన అనుభవాలను నెమరు వేసుకున్నారు. అలాగే టీఎన్జీవో సంఘ అధ్యక్షుడు సుమన్, ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్ అలుక కిషన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్​ రెడ్డి, అన్ని శాఖల అధికారులు ఇరువురిని సన్మానించారు.

    వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ఉద్యోగులు

    More like this

    Global market Analysis | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Global market Analysis : యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు(Europe markets) సోమవారం లాభాలతో ముగిశాయి. మంగళవారం...

    Gold And Silver | కాస్త శాంతించిన బంగారం ధర..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold And Silver : నిన్న‌టి వ‌ర‌కు కూడా దేశీయంగా బంగారం ధ‌ర‌లు ఆల్‌టైమ్ గరిష్టానికి...

    NH 44 | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఒకరి దుర్మరణం

    అక్షరటుడే, ఇందల్వాయి: NH 44 | జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నాలుగైదు రోజుల క్రితం...