అక్షరటుడే, కామారెడ్డి: Redcross Society | జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన రక్తదాన శిబిరాలకు గుర్తింపు లభించింది. రాష్ట్రంలోనే బెస్ట్ బ్లడ్ డోనర్ అవార్డు (Best Blood Donor Award) జిల్లాకు దక్కింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం(World Blood Donor Day) సందర్భంగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (State Governor Jishnu Dev Verma) చేతుల మీదుగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అవార్డును అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కామారెడ్డి జిల్లాకే ఈ అవార్డు దక్కడంపై జిల్లా ప్రజలు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
