ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​MP Arvind | నగరంలో కాంగ్రెస్​కు అభ్యర్థులు లేరు : ఎంపీ అర్వింద్​

    MP Arvind | నగరంలో కాంగ్రెస్​కు అభ్యర్థులు లేరు : ఎంపీ అర్వింద్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Arvind | ఏ ఎన్నికలు వచ్చినా నిజామాబాద్​ (Nizamabad)జిల్లాలో బీజేపీ (BJP) గెలుస్తుందని ఎంపీ అర్వింద్ (MP Arvind)​ ధీమా వ్యక్తం చేశారు. ఈనెల చివరి వారంలో ఇందూరుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్న నేపథ్యంలో నిజామాబాద్ కార్పొరేషన్ స్థాయి ముఖ్య నాయకుల సన్నాహక సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో రెండే పార్టీలు గెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. మెజారిటీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని, కొన్ని ప్రాంతాల్లో ఎంఐఎం గెలిచే అవకాశం ఉందన్నారు. నగరంలో కాంగ్రెస్​కు పోటీ చేయడానికి అభ్యర్థులు లేరని ఆయన అన్నారు. టికెట్​ రాని వారు ఎవరైనా తప్పేదారి బీజేపీ నుంచి వెళ్తే వారే ఆ పార్టీకి దిక్కు అవుతారని వ్యాఖ్యానించారు.

    MP Arvind | ఆ పార్టీలోకి వెళ్తే ఆత్మహత్య చేసుకున్నట్లే..

    నగరంలో కొందరు నాయకులు బీజేపీ నుంచి టికెట్​ రాకపోతే కాంగ్రెస్​ (congress)లోకి వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తనకు తెలిసిందన్నారు. ఆ పార్టీలోకి వెళ్తే ఆత్మహత్య చేసుకున్నట్లేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. పని చేసేవారికి టికెట్​ ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు తాను సర్వే చేసినట్లు తెలిపారు. బీజేపీ టికెట్​ వస్తే పోటీ చేయాలని, రాకపోతే వచ్చిన వారిని గెలిపించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో భవిష్యత్​ బీజేపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కష్టపడ్డ వారికి తర్వాత ఇతర చోట్ల అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

    నిజామాబాద్​లో జిల్లా పరిషత్​ ఛైర్మన్​, మున్సిపల్​ ఛైర్మన్​ పదవులను బీజేపీ గెలుచుకుంటుందని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చాటుతుందన్నారు. ప్రజలు బీజేపీకి తప్పా ఇతర పార్టీలకు ఓటు వేయడానికి సిద్ధంగా లేరన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్​ అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ, ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేశ్​ రెడ్డి, పసుపు బోర్డు జాతీయ ఛైర్మన్​ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

    More like this

    Banswada | ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయం : పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam...

    Nepal | 11 ఏళ్ల బాలిక వ‌ల్ల నేపాల్ ప్ర‌భుత్వం కూలిందా.. ఉద్యమం ఉద్రిక్త‌త‌కి దారి తీయడానికి కార‌ణం ఇదే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌లో జెన్‌ జెడ్‌ యువత ప్రారంభించిన ఉద్యమం ఊహించని రీతిలో ఉద్రిక్తతకు...

    Nara Lokesh | నేపాల్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం.. సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్నిర‌ద్దు చేసుకున్న నారా లోకేష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | నేపాల్‌(Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న తెలుగువారిని...