అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Indiramma Housing Scheme | కోరుట్ల నియోజకవర్గంలోని (Korutla Constituency) మల్లాపూర్‌లో శనివారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సహకార సంస్థ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి (State Cooperative Society), కోరుట్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి నర్సింగ్ రావు పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు సహకరిస్తానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మల్లాపూర్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకుడు తిరుపతి రెడ్డి, ఏంఎసీ ఛైర్మన్ సీతక్క, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, మాజీ ఎంపీపీ రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.
