ePaper
More
    Homeక్రీడలుWTC Final | కంగారూల‌కు క‌న్నీళ్లు పెట్టించిన సౌతాఫ్రికా.. తొలిసారి ఐసీసీ ట్రోఫీ అందుకున్న స‌ఫారీ...

    WTC Final | కంగారూల‌కు క‌న్నీళ్లు పెట్టించిన సౌతాఫ్రికా.. తొలిసారి ఐసీసీ ట్రోఫీ అందుకున్న స‌ఫారీ జ‌ట్టు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: WTC Final | సౌతాఫ్రికా ఎన్నో ఏళ్ల నాటి క‌ల తీరిది. చేతి వ‌ర‌కు వ‌చ్చిన‌ట్టు వ‌చ్చిన ఐసీసీ ట్రోఫీని ఆ జట్టు గతంలో ప‌లుమార్లు మిస్ చేసుకుంది. కానీ ఈ సారి బ‌వుమా నేతృత్వంలో అద్భుతంగా ఆడిన స‌ఫారీ జ‌ట్టు ఐదు వికెట్ల తేడాతో ఆసీస్‌పై గెలిచి వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ ట్రోఫీ (World Test Championship trophy) అందుకుంది. దీంతో సౌతాఫ్రికాకు(South africa) చెందిన ప్ర‌తి ఒక్క అభిమాని, ఆట‌గాళ్లు ఎంతో ఎమోష‌న‌ల్ అయ్యారు. నాలుగో రోజు తొలి సెష‌న్ ప్రారంభ‌మైన 10 నిమిషాల్లోనే ఆసీస్ కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్ (captain Pat Cummins) వికెట్ సాధించాడు. నిన్న‌టి నుంచి క్రీజులో పాతుకుపోయిన తెంబ బ‌వుమా (Temba Bavuma) (66)ను ఔట్ చేసి కంగ‌రూల‌కు ఊర‌ట‌నిచ్చాడు.

    WTC Final | కంగ్రాట్స్ టూ స‌ఫారీ టీం

    బ‌వుమా డిఫెన్స్ చేద్దామ‌నుకున్న బంతి ఎడ్జ్ తీసుకోగా వికెట్ కీప‌ర్ అలెక్స్ క్యారీ (Alex Carey) ఒడుపుగా అందుకున్నాడు. దాంతో, మూడో వికెట్‌147 ప‌రుగుల భాగ‌స్వామానికి తెర‌ప‌డింది. సెంచ‌రీ హీరో మ‌ర్క్‌రమ్ (Markram) (136) కూడా ఔట్ కావ‌డంతో కాస్త టెన్ష‌న్ ఏర్ప‌డింది. ఆ స‌మ‌యంలో ద‌క్షిణాఫ్రికా చారిత్రాత్మ‌క విజ‌యానికి 64 ప‌రుగులు అవ‌స‌రం. ఆ త‌ర్వాత వ‌చ్చిన స్ట‌బ్స్ కూడా వెంట‌నే ఔట‌య్యాడు. కానీ డేవిడ్ (21 నాటౌట్) నిల‌క‌డ‌గా ఆడి ద‌క్షిణాఫ్రికాకు చారిత్ర‌క విజ‌యం అందించాడు. లార్డ్స్‌లో తన సెంచరీతో ఐడెన్ మార్క్​రమ్ (Aiden Markram) ఐసీసీ ఫైనల్స్‌లో సెంచరీ చేసిన తొలి దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 275 కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో దక్షిణాఫ్రికా తరపున అతను సెంచరీ చేయడం ఇది మూడోసారి. మొత్తం మీద, ఈ విషయంలో గవాస్కర్, యూనస్ ఖాన్, రికీ పాంటింగ్ (Ricky Ponting) మాత్రమే అతని కంటే ముందున్నారు.

    27 ఏళ్లుగా క‌ళ్ల‌లో వొత్తులు వేసుకొని ఐసీసీ ట్రోఫీ (ICC trophy) కోసం ఎదురుచూస్తున్న‌ ద‌క్షిణాఫ్రికా (South Africa) క‌ల ఎట్ట‌కేల‌కు సాకారం అయింది. ఆస్ట్రేలియా (Australia) గోడ‌ను బ‌ద్ధ‌లు కొడుతూ ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ (WTC 2023-25) ఫైన‌ల్లో స‌ఫారీ జ‌ట్టు విజేత‌గా అవ‌త‌రించింది. లార్డ్స్ మైదానంలో వేలాది ప్రేక్ష‌కుల స‌మ‌క్షంలో టెస్టు గ‌ద‌ (Testt Mace)ను మురిపెంగా గుండెల‌కు హ‌త్తుకుంది. మొత్తానికి డ‌బ్ల్యూటీసీలో కొత్త ఛాంపియ‌న్ ఆవిర్భ‌వించింది. తొలి రెండు సీజ‌న్లలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా విజేత‌గా నిల‌వ‌గా.. ఈసారి త‌మ వంతు అని స‌ఫారీ జ‌ట్టు టెస్టు గ‌ద‌ను త‌న్నుకుపోయింది.

    More like this

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల(Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ భూములను...

    KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ అని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల...

    Vice President Election | ముగిసిన ఉప రాష్ట్రపతి ఎన్నిక.. 96 శాతం పోలింగ్.. ఓటేసిన అధికార, విపక్ష ఎంపీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Election | ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. మంగళవారం ఉదయం 10...