అక్షర టుడే, బిచ్కుంద:Indiramma Houses | అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish Sangwan) అన్నారు. శుక్రవారం బిచ్కుంద(Bichkunda) మండలకేంద్రంలో లబ్ధిదారు ఇంటిని పరిశీలించారు. రేకుల షెడ్డులో ఉంటున్నామని, తమకు ఇల్లు మంజూరు చేయాలని ఆమె కలెక్టర్‌ను కోరారు. దీంతో కలెక్టర్ పైవిధంగా స్పందించి, అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీఓ గోపాలకృష్ణ, కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, సిబ్బంది ఉన్నారు.
