అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | మండలంలోని మంగుళూరు గేటు సమీపంలో సంగారెడ్డి–నాందేడ్ – అకోలా జాతీయ రహదారిపై మిషన్ భగీరథ(Mission Bhagiratha) పైపునకు లీకేజీ ఏర్పడింది. దీంతో తాగునీరు భారీగా వృథాగా పోతోంది. సింగూరు(Singur) నుంచి జుక్కల్(Jukkal) వెళ్లే ప్రధాన పైపులైన్‌కు లీకేజీ ఏర్పడడంతో నీరు వృథాగా వెళ్తోంది. ఈ విషయమై స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారమివ్వగా, వారు నీటి విడుదల నిలిపేశారు.
