ePaper
More
    HomeజాతీయంChhattisgarh | డీఎస్పీ భార్య బర్త్‌డే సెల‌బ్రేష‌న్స్.. పోలీసు కారు బ్యానెట్‌పై కూర్చొని రీల్‌..: వీడియో

    Chhattisgarh | డీఎస్పీ భార్య బర్త్‌డే సెల‌బ్రేష‌న్స్.. పోలీసు కారు బ్యానెట్‌పై కూర్చొని రీల్‌..: వీడియో

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Chhattisgarh | ప్రభుత్వ వాహనాలను(government vehicles) వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడం ఈ మ‌ధ్య కాలంలో మ‌నం చాలా చూశాం. తాజాగా ఇలాంటి సంఘటన ఒక‌టి వెలుగులోకి వచ్చింది. జంజ్‌గిర్-చాంపా జిల్లా డీఎస్పీ తస్లీం ఆరీఫ్(Janjgir-Champa District DSP Taslim Arif) భార్య ఫ‌ర్హీన్ ఖాన్ త‌న పుట్టినరోజు వేడుకలను ఒక ప్రభుత్వ వాహనం ఉప‌యోగించి చేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశమైంది. ఏకంగా బ్యానెట్‌పై కూర్చొని కేక్ కట్ చేస్తూ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో డీఎస్పీ భార్య(DSP Wife)తో పాటు మరికొంద‌రు మహిళలు కూడా అదే వాహనంలో కనిపించారు.

    Chhattisgarh | ఇదేం తీరు..

    ఫ‌ర్హీన్ ఖాన్ కారు బ్యానెట్‌పై కూర్చుని పుట్టిన రోజు కేక్ కట్ చేశారు. అంతేకాకుండా “స్నో స్ప్రే”తో విండ్షీల్డ్‌పై “32” అని రాసింది, తరువాత డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి వైపర్స్‌తో దాన్ని తుడిచేశాడు. అనంత‌రం ఆమె మళ్లీ “33” అని రాస్తున్న దృశ్యాలు వీడియోలో క‌నిపించాయి. కారు బ్యానెట్‌(car bannet)పై కేక్, పుష్పగుచ్ఛం కూడా ఉంచారు. ఈ రీల్‌ వీడియోను సరగానా రిసార్ట్‌(Saragana Resort)లో చిత్రీకరించినట్లు సమాచారం. ఇక కారు అలా ముందుకు పోతుంటే బ్యానెట్‌పై డీఎస్పీ వైఫ్ ఉంది. మిగ‌తా డోర్స్ అన్నీ ఓపెన్ చేసి అక్క‌డ ఆమె ఫ్రెండ్స్ నిలుచొని ఉన్నారు.

    డిక్కీ డోరు కూడా ఓపెన్ చేసి ఉండ‌గా, అందులో కూడా ఒక మ‌హిళ కూర్చొని ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, అధికారిక వాహనాలు కేవలం ప్రభుత్వ అవసరాలకే వినియోగించాలి. వ్యక్తిగత వేడుకల కోసం ఇటువంటి వాహనాలను వినియోగించడం నిబంధనలకు విరుద్ధం. ముఖ్యంగా బ్లూ బీకాన్(blue beacon) వంటి అధికార గుర్తింపు చిహ్నాలున్న వాహనాలను వినియోగించడం నేరంగా పరిగణిస్తారు. అయితే ఇప్పటివరకు సంబంధిత డీఎస్పీపై ఎలాంటి అధికారిక చర్య తీసుకోలేదు. ఈ సంఘటనపై ప్రజల నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    Latest articles

    Tirumala | తిరుమలలో పోటెత్తిన భక్తులు.. శ్రీవాణి దర్శనం టికెట్ల దగ్గర ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమలలో కొలువైన వేంకటేశ్వర స్వామి (Venkateswara Swamy) వారి దర్శనం కోసం...

    Trump Tariffs | మ‌రిన్ని సుంకాలు ఉండ‌క‌పోవ‌చ్చు.. సూచ‌న‌ప్రాయంగా వెల్ల‌డించిన ట్రంప్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Tariffs | ర‌ష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్న దేశాలపై మ‌లి...

    Kamareddy | పేద ప్రజలకు అండగా నిలుస్తా.. యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | అన్యాయానికి గురవుతున్న పేద ప్రజలకు అండగా నిలుస్తానని.. అందుకే యూనివర్సల్ హ్యూమన్ రైట్స్...

    Heavy Rains | భారీ వర్షాల‌తో ముంబై అతులాకుత‌లం

    అక్షరటుడే, ముంబై : Heavy Rains | ముంబై(Mumbai) భారీ వ‌ర్షాల‌తో అతులాక‌తుల‌మైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల...

    More like this