Giriraj College | గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలకు ప్రతిష్టాత్మకమైన అవార్డు
Giriraj College | గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలకు ప్రతిష్టాత్మకమైన అవార్డు

అక్షరటుడే, ఇందూరు:Giriraj College | ఎడ్యుకేషన్ వరల్డ్ సంస్థ(Education World Organization) ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా హయ్యర్​ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ 2025-26కు గాను గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Giriraj Government Degree College)కు అవార్డు ప్రకటించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి(Dr. Rammohan Reddy) తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో అవార్డును అందుకున్నారు. అవార్డుకు ఎంపిక కావడం పట్ల కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం(College Vice Principal Rangaratnam), పరీక్షల నియంత్రణ అధికారి భరత్ రాజ్, అకాడమీ కోఆర్డినేటర్ గంగాధర్, పీఆర్​వో దండు స్వామి, ఎన్సీపీ అధికారి లెఫ్ట్​నెంట్​ డాక్టర్ రామస్వామి, ఆయా విభాగాల అధిపతులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.