ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBlood donors | రక్తదాతల సేవలు అభినందనీయం

    Blood donors | రక్తదాతల సేవలు అభినందనీయం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Blood donors | కామారెడ్డి రక్తదాతల సేవలు అభినందనీయమని జిల్లా జడ్జి వరప్రసాద్‌ అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం (World Blood Donor Day) సందర్భంగా రెడ్‌ క్రాస్‌ సొసైటీ, జూనియర్‌ యూత్‌ విభాగం ఆధ్వర్యంలో ఆర్కే డిగ్రీ కళాశాలలో రక్తదాతలకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడారు.

    చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాలు (Mega blood donation camps) నిర్వహిస్తున్న డాక్టర్​ బాలును ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మూడు కంటే ఎక్కువసార్లు రక్తదానం చేసిన 24 మందికి పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి, సర్వ్‌ నీడి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు గౌతమ్, ఆర్కే విద్యాసంస్థల సీఈవో జైపాల్‌ రెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రమేష్, కామారెడ్డి రక్తదాతల గ్రూప్‌ అధ్యక్షుడు జమీల్, ఉపాధ్యక్షుడు వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Medak | రెండేళ్ల కుమార్తెను చంపి ప్రియుడితో వెళ్లిపోయిన మహిళ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medak | మానవ సంబంధాలు మంట గలిసిపోయాయి. ప్రేమ, వివాహేతర సంబంధాల కోసం కొంత...

    Godavari Pushkaras | దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: Godavari Pushkaras | గోదావరి పుష్కరాలను దక్షిణ భారత South Indian కుంభమేళా Kumbh Mela...

    Road Transport Department | వాహనదారులకు అలెర్ట్​.. ఇక వాటిని తప్పక ఏర్పాటు చేసుకోవాల్సిందే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Road Transport Department | రోడ్డు ప్రమాదాల్లో (Road Accidents) ఎక్కువ శాతం రాత్రి...