అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Forbes | టెస్లా(Tesla) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ఆయన తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. యూఎస్(US)కు చెందిన మస్క్ సంపద విలువ 423 బిలియన్ డాలర్లు. ఆయన టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ కార్ప్, ఎక్స్ ఏఐ కంపెనీలు నిర్వహిస్తున్నారు.
ద్వితీయ స్థానంలోకి ఒరాకిల్ (Oracle) సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ (Larry Ellison) దూసుకువచ్చాడు. ఆయన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను వెనక్కి నెట్టి సొంతం చేసుకున్నారు. యూఎస్‌కే చెందిన ఎల్లిసన్.. ఒరాకిల్ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఆయన సంపద విలువ 256.1 బిలియన్ డాలర్లు.
ప్రపంచంలో మూడో అత్యంత ధనవంతుడిగా యూఎస్‌కే చెందిన మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg) నిలిచారు. ఆయన మెటా(ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్) నిర్వహిస్తున్నారు. ఆయన సంపద విలువ 239.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గతంలో రెండో స్థానంలో ఉన్న అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(Jeff Bezos).. తాజా జాబితాలో నాలుగో స్థానానికి పడిపోయారు. యునైటెడ్ స్టేట్స్కు చెందిన ఆయన అమెజాన్, బ్లూ ఒరిజిన్ కంపెనీలను నిర్వహిస్తున్నారు. బెజోస్ సంపద విలువ 227.8 బిలియన్ డాలర్లుగా ఉంది.అమెరికాకే చెందిన వారెన్ బఫెట్ (Warren Buffett) ప్రపంచ కుబేరుల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు. ఆయన వ్యాపారం బెర్క్‌షైర్ హాత్వే. సంపద విలువ 153.1 బిలియన్ డాలర్లు.
Forbes | అంబానీ, అదానిల స్థానం ఎక్కడంటే..
మన దేశానికి చెందిన ముకేశ్ అంబానీ(Mukesh Ambani) 97.5 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో పదో స్థానంలో ఉన్నారు. గౌతమ్ అదాని(Gautam Adani) 69.1 బిలియన్ డాలర్ల సంపదతో 16వ స్థానంలో కొనసాగుతున్నారు.