Red Cross Society
Red Cross Society | జిల్లా రెడ్​క్రాస్​ సొసైటీకి ఐఎస్​వో అవార్డు

అక్షరటుడే, ఇందూరు: Red Cross Society | నిజామాబాద్​ రెడ్​క్రాస్​ సొసైటీని రాష్ట్ర గవర్నర్ ఐఎస్​వో అవార్డుతో (ISO Award) సత్కరించారు. శనివారం ప్రపంచ రక్త దాతల దినోత్సవం (World Blood Donor Day) పురస్కరించుకొని రాజభవన్​లో (Raj bhavan) నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్​ జిష్ణు దేవ్​ వర్మ (Governor Jishnu Dev Verma) అవార్డును అందజేశారు.

జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అత్యధికంగా రక్తదాన శిబిరాలు, తలసేమియా అవగాహన సదస్సులు నిర్వహించినందుకు ఐఎస్​వో సర్టిఫికెట్ ప్రదానం చేశారు. అలాగే అత్యధికంగా 65సార్లు రక్తదానం చేసిన గంగాధర్​కు అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.