ePaper
More
    HomeజాతీయంBlack box | బ్లాక్ బాక్స్​ను డీకోడ్ చేస్తున్నాం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

    Black box | బ్లాక్ బాక్స్​ను డీకోడ్ చేస్తున్నాం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Black box | అహ్మదాబాద్​లో జరిగిన విమాన ప్రమాద స్థలంలో బ్లాక్​బాక్స్​ దొరికిందని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్​ నాయుడు (Rammohan Naidu) తెలిపారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India plane crash) అనంతరం తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదానికి గురైన ప్రాంతం నుంచి బ్లాక్​బాక్స్‌ను (black box) వెలికితీయడం జరిగిందన్నారు. దాని డేటాను డీకోడ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఘటనపై విస్తృత స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ఘటన జరగగానే విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ(AAIB)ను అప్రమత్తం చేశామన్నారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారని పేర్కొన్నారు. నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో బ్లాక్ బాక్స్‌ను వెలికితీసినట్లు రామ్మోహన్​ నాయుడు తెలిపారు.

    Black box | బ్లాక్ బాక్స్ డీకోడ్ చేస్తే ఏం జరిగిందో తెలిసే అవకాశం

    బ్లాక్ బాక్స్​ను (black box) డీకోడ్​ చేయడం వద్ద ప్రమాద సమయంలో లేదా అంతకంటే ముందుగా ఏం జరిగిందనేది తెలుసుకోవచ్చని కేంద్ర మంత్రి తెలిపారు. దాని ద్వారా లోతైన సమాచారం లభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. AAIB నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఈ ఘటన తర్వాత బోయింగ్​ 787 సిరీస్‌ విమానాలపై (Boeing 787 series aircraft) విస్తృత నిఘా అవసరమని గుర్తించామని పేర్కొన్నారు. ఇప్పటికే 8 విమానాలను తనిఖీ చేశామని.. మిగతా వాటిని తనిఖీ చేస్తామని చెప్పారు.

    More like this

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...