ePaper
More
    Homeటెక్నాలజీOppo K13 X | ఎంట్రీకి రెడీగా ఒప్పో కే13 ఎక్స్‌.. వచ్చేనెలలో లాంచ్‌ అయ్యే...

    Oppo K13 X | ఎంట్రీకి రెడీగా ఒప్పో కే13 ఎక్స్‌.. వచ్చేనెలలో లాంచ్‌ అయ్యే అవకాశం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Oppo K13 X | చైనా(China)కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ కంపెనీ ఒప్పో(OPPO) మరో మోడల్‌తో వినియోగదారుల ముందుకు వస్తోంది. ఇటీవలే సిల్హౌట్‌ను విడుదల చేసింది. లాంచ్‌ డేట్‌ను ఇంకా ప్రకటించలేదు. వచ్చేనెలలో OPPO K13x 5G model మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌(Flipkart)తో పాటు ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌లో అందుబాటులో ఉండనుంది. కంపెనీనుంచి లీక్‌ అయిన సమాచారం మేరకు ఈ మోడల్‌ ఫీచర్లు ఇలా ఉండే అవకాశాలున్నాయి.

    డిస్‌ప్లే : 6.7 ఇంచెస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే. 1080 × 2400 పిక్సెల్స్‌ Full HD+ రిజల్యూషన్‌. 120 Hz రిఫ్రెష్‌ రేట్‌. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌.

    ప్రాసెసర్ : మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌.

    బ్యాటరీ: 6000 mAh బ్యాటరీ. 45w ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌.

    కెమెరా : 50 MP డ్యుయల్‌ రేర్‌ కెమెరా, 2 MP డెప్త్‌ సెన్సార్‌. ఏఐ ఆధారిత కెమెరా సిస్టమ్‌ కలిగి ఉంటుంది. 8MP లేదా 16 MP ఫ్రంట్‌ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇందులో ఏఐ ఇమేజింగ్‌, ఎడిటింగ్‌ ఫీచర్లుండే అవకాశాలున్నాయి.

    ఆపరేటింగ్‌ సిస్టమ్‌ : ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత కలర్‌ ఓఎస్‌ 15.

    కలర్స్ : మిడ్‌నైట్‌ వయోలెట్‌, సన్‌సెట్‌ పీచ్‌ కలర్లలో లభించనుంది.

    అదనపు ఫీచర్లు : IP 65 డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌. 360 డిగ్రీస్‌ ఆర్మర్‌ బాడీ, మిలిటరీ గ్రేడ్‌ షాక్‌ రెసిస్టెన్స్‌.

    వేరియంట్‌ : 8 GB + 256 GB. ధర రూ. 16 వేలలోపు ఉండే అవకాశాలున్నాయి.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...