Lava Storm play 5G
Lava Storm play 5G | లావా నుంచి మరో ఫోన్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్: Lava Storm play 5G | లావా నుంచి మరో ఫోన్‌దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ లావా(LAVA) దూకుడు పెంచింది. మార్కెట్‌లో వాటా పెంచుకునేందుకు కొత్తకొత్త మోడళ్లను విడుదల చేస్తోంది. తాజాగా లావా స్ట్రార్మ్‌ ప్లే 5జీ(Lava Storm play 5G) పేరుతో మరో మోడల్‌ను తీసుకువస్తోంది. బడ్జెట్‌ సెగ్మెంట్‌లో LPDDR5 RAM రామ్, UFS 3.1 స్టోరేజ్‌, డైమెన్సిటీ 7060 చిప్‌సెట్‌తో శక్తిమంతమైన పనితీరును అందిస్తుందని భావిస్తున్నారు. ఈనెల 19నుంచి అమెజాన్‌లో విక్రయాలు ప్రారంభం కానున్న ఈ మోడల్‌ స్పెసిఫికేషన్స్‌ తెలుసుకుందామా..

డిస్‌ప్లే: 6.75 అంగుళాల HD+ నాచ్‌ డిస్‌ప్లే, 120 Hz రిఫ్రెష్‌ రేటు. IP 64 డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌.

ప్రాసెసర్‌ : మీడియాటెక్‌ డైమెన్సిటీ 7060(వర్ల్డ్‌ ఫస్ట్‌), 500K+

ఓఎస్‌ : ఆండ్రాయిడ్‌ 15. ఒక మేజర్‌ ఓఎస్‌ అప్‌గ్రేడ్‌, రెండేళ్ల సెక్యూరిటీ అప్‌గ్రేడ్స్‌.

కెమెరా : వెనకవైపు 50MP ప్రైమరీ(సోనీ ఐఎంఎక్స్‌ 752 సెన్సార్‌) + 8 MPఅల్ట్రావైడ్‌ కెమెరా
ముందువైపు సెల్ఫీలు, వీడియో కాలింగ్‌ కోసం 8 MP కెమెరా.

బ్యాటరీ : 5000 mAh బ్యాటరీ, 18w ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

కలర్స్‌ : గ్రీన్‌, థండర్‌ బ్లాక్‌.

వేరియంట్‌ : 6 GB + 128 GB. ధర రూ.9,999.