ePaper
More
    HomeతెలంగాణCongress | ఖైరతాబాద్ కాంగ్రెస్​లో వర్గపోరు

    Congress | ఖైరతాబాద్ కాంగ్రెస్​లో వర్గపోరు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | హైదరాబాద్​లోని ఖైరతాబాద్ నియోజకవర్గ(Khairatabad constituency) కాంగ్రెస్​ నాయకుల్లో వర్గపోరు మరోసారి బయట పడింది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్(MLA Danam Nagender)​కు, కార్పొరేటర్​ విజయరెడ్డికి(Corporator Vijaya Reddy) కొంతకాలంగా పడడం లేదు. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన సమావేశంలో ఇద్దరు నేతలు వాగ్వాదం చేసుకున్నారు.

    బంజారాహిల్స్ లేక్ వ్యూలో శనివారం నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే దానం నాగేందర్​, కార్పొరేటర్​ విజయరెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో వారు ఇద్దరు వాగ్వాదం చేసుకున్నారు. దీంతో వారి అనుచరులు సైతం పోటాపోటీగా నినాదాలు చేశారు. క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారని అసంతృప్తితో డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి(DCC President Rohin Reddy) అక్కడి నుంచి వెళ్లిపోయారు.

    మాజీ మంత్రి పి జనార్దన్​రెడ్డి(PJR) కూతురు విజయ రెడ్డి గతంలో బీఆర్​ఎస్​లో ఉన్నారు. 2022లో ఆమె రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. ఈ క్రమంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్​ టికెట్​ దక్కించుకున్నారు. అయితే బీఆర్​ఎస్​ నుంచి పోటీచేసిన దానం నాగేందర్ ఎన్నికల్లో గెలిచారు. అనంతరం ఆయన కాంగ్రెస్​(Congress)లో చేరడంతో ఇద్దరు నేతల మధ్య వర్గపోరు నడుస్తోంది. ఈ క్రమంలో శనివారం ఇరువర్గాల నాయకులు పోటాపోటీగా నిరసనలకు దిగారు.

    More like this

    ACB Raids | ఏసీబీ అధికారుల దూకుడు.. పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి...

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...