ePaper
More
    HomeతెలంగాణMLC Kavitha | రేవంత్​రెడ్డి అసమర్థ సీఎం.. ఎమ్మెల్సీ కవిత

    MLC Kavitha | రేవంత్​రెడ్డి అసమర్థ సీఎం.. ఎమ్మెల్సీ కవిత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :MLC Kavitha | రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) లాంటి అసమర్థ ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కవిత తన తండ్రికి రాసిన లేఖ బయటకు వచ్చిన అనంతరం బీఆర్​ఎస్​తో దూరంగా ఉంటున్న కవిత.. తెలంగాణ జాగృతి బలోపేతంపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో శనివారం పలువురు విద్యార్థి నాయకులు (Student leaders) జాగృతిలో చేరారు. వారికి కవిత కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

    MLC Kavitha | సామాజిక తెలంగాణ సాధించాలి

    ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మాట్లాడుతూ.. సామాజిక తెలంగాణ సాధనకు విద్యార్థి లోకం కదిలిరావాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని, అదే స్ఫూర్తితో సామాజిక తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొనాలన్నారు.

    MLC Kavitha | రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు పెట్టాలి

    బీసీ రిజర్వేషన్ల బిల్లులు (BC Reservation Bills) కేంద్రం వద్ద పెండింగ్​లో ఉండగానే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచన సరికాదని ఆమె అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్​ చేశారు.

    MLC Kavitha | తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన సీఎం

    సీఎం రేవంత్​రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని కవిత వ్యాఖ్యానించారు. కనీసం మంత్రివర్గాన్ని కూర్పు చేసుకోలేని సీఎం అని ఎద్దేవా చేశారు. ఇంత అసమర్థ, బలహీన ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇంత బలహీనంగా లేరని పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి (Telangana Jagruti) విద్యార్థి విభాగం విద్యారంగ సమస్యలపై పోరాటం చేయాలన్నారు. రాష్ట్రంలో 8 వేల కోట్ల మేర ఫీజు రియింబర్స్​మెంటు బకాయిలు ఉన్నాయని.. వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

    More like this

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...