ePaper
More
    Homeజిల్లాలుకరీంనగర్ACB | ఈఈ శ్రీధర్​ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

    ACB | ఈఈ శ్రీధర్​ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:ACB | అధికారాన్ని అడ్డం పెట్టుకొని భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన ఇరిగేషన్​ శాఖ ఈఈ శ్రీధర్ ​(Irrigation Department EE Sridhar) కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

    కరీంనగర్​ జిల్లా చొప్పదండిలోని ఎస్సారెస్పీ డివిజన్​ కార్యాలయం(SRSP Division Office)లో ఈఈగా పని చేస్తున్న నూనె శ్రీధర్​ ఇళ్లలో ఇటీవల దాడులు చేసిన ఏసీబీ అధికారులు దాడులు జరిపి (ACB Officers) భారీగా అక్రమాస్తులు గుర్తించిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్ట్​ ఈఈగా వ్యహరించిన సమయంలో ఆయన కోట్లకు పడగలెత్తినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆయనను అరెస్ట్​ చేసి చంచల్​గూడ జైలుకు తరలించారు.

    ACB | మరికొందరి పాత్ర

    ఈఈ శ్రీధర్‌ వ్యవహారంలో మరికొంతమంది అధికారుల పాత్ర ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. కాగా ఆయనను ఇరిగేషన్‌ చీఫ్ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆ శాఖ కార్యదర్శి రాహుల్​ బొజ్జ గతేడాది జూన్ 27న ఆదేశించారు. అయితే అధికారుల ఆదేశాలను పక్కనపెట్టిన శ్రీధర్.. బదిలీ అయిన తర్వాత కూడా ఏడాది పాటు చొప్పదండిలోనే పని చేయడం గమనార్హం. ఈఎన్​సీ అనిల్ ఆదేశాలతోనే శ్రీధర్‌ పనిచేసినట్లు అనుమానం.

    ACB | కస్టడీ కోరుతూ ఏసీబీ పిటిషన్​

    ఈఈ శ్రీధర్​ రిమాండ్​ ఖైదీగా ప్రస్తుతం చంచల్​గూడ జైలు(Chanchalguda Jail)లో ఉన్నారు. ఆయనను కస్టడీకి అప్పగించాలని ఏసీబీ పిటిషన్​ దాఖలు చేసింది. ఈఎన్‌సీ అనిల్, శ్రీధర్‌ సంబంధాలపై ఏసీబీ ఆరా తీయనున్నట్లు సమాచారం. వారం పాటు శ్రీధర్ను కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోరింది.

    More like this

    Crop Damage | నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుంది

    అక్షరటుడే, డోంగ్లి: Crop Damage | ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మండలంలో 3,200 ఎకరాల్లో పంట...

    Movements and Protests | రెండు దేశాలు.. రెండు ఉద్యమాలు.. ప్రభుత్వాలను కూల్చేసిన నిరసనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movements and Protests | రెండు దేశాల్లో రగిలిన రెండు ఉద్యమాలు అక్కడి ప్రభుత్వాలను...

    Kamareddy | ఊపిరితిత్తులలో ఇరుక్కున్న శనగ గింజ.. చికిత్స చేసి తొలగించిన వైద్యులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని శ్వాస చెస్ట్ అండ్ జనరల్ ఆస్పత్రిలో (Swasah Chest and General...