Vikhroli Bridge
Vikhroli Bridge | ఈ రోజు నుండి అందుబాటులోకి విఖ్రోలి బ్ర‌డ్జి.. మూడు లైన్ల‌తో వన్ వేగా..!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vikhroli Bridge | ముంబై నగరంలో(Mumbai city) ట్రాఫిక్ సమస్యలతో ప్ర‌జ‌లు ఎన్ని ఇబ్బందులు ప‌డుతున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌తో (Traffic Problems) న‌ర‌క‌యాత‌న ప‌డుతున్నారు. దీనికి ఒక శాశ్వత పరిష్కారం అందించేందుకు విఖ్రోలి రోడ్ ఓవర్ బ్రిడ్జిని(ROB) నిర్మించడం జ‌రిగింది. ఈ వంతెన, విఖ్రోలి వెస్ట్​ను ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేతో(EEH) అనుసంధానం చేస్తుంది. ఇది ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌ను తగ్గించడమే కాకుండా, ప్రయాణ సమయం కూడా సేవ్ అయ్యేలా చేస్తుంది. విఖ్రోలి వెస్ట్ – లాల్ బహదూర్ శాస్త్రి మార్గ్ నుంచి ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే వరకు 615 మీటర్లు బ్రిడ్జిని రూపొందించ‌డం జ‌రిగింది.

Vikhroli Bridge | నేటి నుండి అందుబాటులోకి..

ఈ బ్రిడ్జిపై మొత్తం 3 లైన్లు ఉండ‌గా, అందులో 2 లైన్లు సాధారణ వాహనాల కోసం, 1 లైన్ బస్సుల కోసం ప్రత్యేకంగా రూపొందించార‌ని స‌మాచారం. అయితే దీని ఖ‌ర్చు రూ.105 కోట్లు అయినట్టు తెలుస్తుంది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (Mumbai Municipal Corporation) ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ బ్రిడ్జిని రూపొందించ‌గా, ఇది నేటి నుంచి ప్ర‌జ‌ల‌కి అందుబాటులోకి వ‌స్తుంది. ప్ర‌స్తుతం ఈ బ్రిడ్జిపైన ఒకే దిశలో వాహనాలు వెళ్లనున్నాయి. త‌ర్వాత రెండు దిశ‌ల‌లో వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ఓ నెటిజ‌న్ ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న వేశారు. 3 లైన్లతో రెండు దిశలలో ట్రాఫిక్ ఎలా వెళుతుంది అని అన్నాడు. ప్ర‌స్తుతం ఇది నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఈ బ్రిడ్జిపై పబ్లిక్ ట్రాన్సిట్‌ను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రత్యేక బస్ లైన్ ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ట‌. ఘాట్కోపర్, పవాయ్, బంద్రా వంటి ప్రాంతాలకూ వెళ్లేవారికి ఈ బ్రిడ్జి చాలా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. దీని వ‌ల‌న ట్రాఫిక్‌లో గడిపే సమయం సుమారు 30 నిమిషాల వరకు తగ్గనుంది. ముంబై నగరంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (Infrastructure) అభివృద్ధికి ఇది చక్కటి ఉదాహరణ అని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. విఖ్రోలి వంతెన, ముంబై నగరాభివృద్ధికి (Mumbai city development) ముంద‌డుగు అని చెబుతుండ‌గా, ఇది సంపూర్ణంగా ఉపయోగపడాలంటే లోకల్ రోడ్లను కూడా సమంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైన‌ ఉందని న‌గ‌ర‌వాసులు అంటున్నారు.