ePaper
More
    HomeజాతీయంWeather Report | అక్కడ మండుతున్న ఎండలు.. ఇక్కడ భారీ వర్షాలు

    Weather Report | అక్కడ మండుతున్న ఎండలు.. ఇక్కడ భారీ వర్షాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Weather Report | దేశంలో వాతావరణం భిన్నంగా ఉంది. ఓ వైపు ఎండలు మండుతుండగా.. మరోవైపు వర్షాలు దంచికొడుతున్నాయి. గత కొద్దిరోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో భానుడి తన ప్రతాపం చూపుతున్నాడు. ఎండల దాటికి ప్రజలు అల్లాడున్నారు.

    ఢిల్లీ, యూపీ, హర్యానా, రాజస్థాన్‌, పంజాబ్, హర్యానాలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఢిల్లీలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లో 45 నుంచి 49 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్​ అలర్ట్​(Orange Alert) జారీ చేశారు. వేడిగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

    Weather Report | దక్షిణాదిలో గాలివానల బీభత్సం

    దక్షిణాది రాష్ట్రాల్లో ఐదు రోజులుగా భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh)​, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనేక చెట్లు, విద్యుత్​ స్తంభాలు నేలకూలుతున్నాయి. ఉపరితల ఆవర్తన ధ్రోణి కారణంగా తెలంగాణ(Telangana)లో మరో నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

    More like this

    YS Jagan | చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డ జగన్​.. ప్రభుత్వం ఉందా అని ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandra Babu)...

    India-Pakistan | మ‌రో నాలుగు రోజుల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. ఇంకా అమ్ముడుపోని టిక్కెట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India-Pakistan | అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో హై వోల్టేజ్‌గా పేరొందిన భారత్ vs పాకిస్తాన్...

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...