ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Talliki Vandanam Scheme | త‌ల్లికి వంద‌నం డ‌బ్బులు జ‌మ‌.. అందని వారు ఇలా చేయండి..

    Talliki Vandanam Scheme | త‌ల్లికి వంద‌నం డ‌బ్బులు జ‌మ‌.. అందని వారు ఇలా చేయండి..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Talliki Vandanam Scheme | తల్లికి వందనం Talliki Vandanam పథకానికి సంబంధించి గత ప్రభుత్వం ఏ నిబంధనలైతే అమలు చేసిందో, అవే నిబంధనలను తాము కూడా పాటిస్తున్నామని నారా లోకేష్(Nara Lokesh) అన్నారు.

    ఈ పథకంపై తమను ప్రశ్నించే నైతిక హక్కు వైసీపీ వాళ్లకు లేదని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.తల్లికి వందనం నిధులు జమ ప్రారంభించామని.. అందరి లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. అర్హత ఉన్నవారు ఎంతమంది ఉన్నా నగదు జమ చేస్తామని చెప్పుకొచ్చారు. అర్హత ఉండీ.. నగదు జమ కాని వారు వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేస్తే.. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

    Talliki Vandanam Scheme | అకౌంట్లలోకి నగదు..

    ‘బాబు సూపర్ సిక్స్’ హామీల్లో భాగంగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తల్లికి వందనం’ పథకం(Talliki Vandanam Scheme) కింద 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లను జమ చేసినట్లు ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వం అమ్మ ఒడి ద్వారా 42లక్షల మంది పిల్లలకు మాత్రమే నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. 2శాతం మంది తల్లుల అకౌంట్ ఇనాక్టివ్ ఉన్నట్లు గుర్తించామని.. వారికి మెసేజ్ ద్వారా అప్రమత్తం చేశామని చెప్పారు. డాక్టర్ సర్వే పల్లె రాధాకృష్ణ విద్యా మిత్ర (Dr. Sarve Palle Radhakrishna Vidya Mitra) ద్వారా పిల్లలకు స్కూల్ కిట్ అందచేస్తున్నట్లు వివరించారు. గత విద్యాశాఖ మంత్రికి కనీస పరిజ్ఞానం కూడా లేదని, యూడైస్ డేటాలో ప్రీప్రైమరీ, ఎల్‌కేజీ, యూకేజీ పిల్లల వివరాలు కూడా కలిపి తప్పుడు లెక్కలు చూపారని లోకేష్ ఆరోపించారు

    రాష్ట్రంలో విద్యార్ధులకు మధ్యాహ్నం భోజనంలో సన్నబియ్యం అమలు చేస్తున్నామని లోకేష్ పేర్కొన్నారు. వన్ క్లాస్ కాన్ టీచర్ అనే నినాదం తో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల లకు ఉచితంగా కరెంట్ సరఫరా ఇస్తున్నామన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు సోమ వారం కల్లా పూర్తి చేస్తామని లోకేష్ పేర్కొన్నారు. అందరి ఆమోదం తో అద్భుతమైన సంస్కరణలు తీసుకువచ్చామని వివరించారు. ఈ పథకం ద్వారా సుమారు 30 లక్షల మంది బీసీ, 12 లక్షల మంది ఎస్సీ, 4.26 లక్షల మంది ఎస్టీ విద్యార్థుల తల్లులతో పాటు ఇతర వర్గాలకు కూడా ప్రయోజనం కలుగుతుందని లోకేష్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ‘అమ్మఒడి’ కింద 42 లక్షల మంది విద్యార్థులకు ఏటా రూ.5,540 కోట్లు కేటాయిస్తే, తమ కూటమి ప్రభుత్వం 67.27 లక్షల మందికి రూ.8,745 కోట్లు అందించిందని పోల్చి చూపారు. నిధుల జమలో ఏవైనా సమస్యలుంటే జూన్ 26 వరకు ‘మనమిత్ర’ వాట్సాప్ ద్వారా లేదా గ్రామ, వార్డు సచివాలయాల్లో సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. కొన్ని ఖాతాలు యాక్టివ్‌గా Active లేకపోవడం వల్ల నిధులు వెనక్కి వచ్చాయని, వారికి ఎస్ఎమ్ఎస్ ద్వారా సమాచారం అందించి, ఖాతాలను యాక్టివేట్ చేయించుకున్న వెంటనే నిధులు జమచేస్తామని వివరించారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...