ePaper
More
    Homeలైఫ్​స్టైల్​Health tips | శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.. అయితే లీవర్ జాగ్రత్త సుమా..

    Health tips | శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.. అయితే లీవర్ జాగ్రత్త సుమా..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Health tips | కాలేయం మన శరీరంలో అతిపెద్ద, అతి ముఖ్యమైన అవయవం. ఇది సక్రమంగా పని చేస్తేనే మన ఆరోగ్యం బాగుంటుంది. లేకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాలేయం(Liver) దెబ్బతిన్నప్పుడు శరీరంలో అనేక లక్షణాలు కనిపిస్తాయి. వీటిని విస్మరిస్తే, ప్రాణాలకు ముప్పు రావచ్చు. కడుపులో వాపు, తేలికపాటి కడుపు నొప్పి, వాంతులు లేదా వికారం, కళ్లు పసుపు రంగులోకి మారడం, ఆకలి లేకపోవడం, ఆహారం జీర్ణం కాకపోవడం(Indigestion) సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే లీవర్ దెబ్బతినే సమయంలో ఎలాంటి సంకేతాలు ఉంటాయి. వాటిని గుర్తించడమెలాగో తెలుసుకుందాం.

    Health tips | ఇవే సంకేతాలు..

    • చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం అంటే కామెర్లు, స్క్లెరల్ ఐక్టెరస్ కాలేయం దెబ్బతినే చాలా తీవ్రమైన లక్షణాలు. వీటిని గుర్తిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. చర్మం, గోర్లు లేదా కళ్లు పసుపు రంగులోకి మారడం గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
    • కడుపులో వాపు రావడం, అది ఎంతకూ తగ్గకపోవడం కూడా కాలేయ రుగ్మతకు(Liver disorder) సంకేతాలే. ఇది ద్రవం పేరుకుపోవడం వల్ల సంభవించవచ్చు. కాలేయం సరిగ్గా పనిచేయనప్పుడు, ఈ ద్రవం మీ కడుపులో. మీ కాళ్లలో కూడా పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.
    • ఎటువంటి కారణం లేకుండా వికారం, వాంతులు చేసుకుంటే అది ఏమాత్రం మంచిది కాదు. ఏమీ తినాలనిపించదు. ఆకలిగా ఉండదు. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుప్పుడు కాలేయం దెబ్బతింటుందని హెచ్చరిక సంకేతంగానే భావించాలి.
    • కడుపులోని కుడి ఎగువ భాగంలో నొప్పి వచ్చి ఎంతకీ తగ్గకపోవడం లీవర్(Liver) సరిగా పని చేయడం లేదని అర్థం చేసుకోవాలి. ఇది హెపటైటిస్(Hepatitis) వల్ల కావచ్చు. అంటే కాలేయం వాపు రావడమన్నమాట. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ లేదా ఆల్కహాల్ వల్ల కూడా జరగవచ్చు.

    Health tips | వీటికి దూరంగా ఉండడం ఉత్తమం..

    కాలేయ పనితీరులో మార్పు వస్తున్నట్లు గమనిస్తే మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఫ్యాటీ లీవర్​కు(Fatty liver) ఆల్కహాల్ ప్రధాన కారణమవుతుంది. అలాగే చక్కెర పదార్థాల వినియోగం తగ్గించాలి. మిఠాయిలు, కుకీలు, సోడాలు, పండ్ల రసాలు వంటి అధిక చక్కెర పదార్థాలను నివారించండి. ఇవి కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని పెంచుతాయి. ఫ్రైడ్ ఐటమ్స్​కు(Fried Items) దూరంగా ఉండడం ఉత్తమం. వీటిలో కొవ్వు, కేలరీలు అధికంగా ఉంటాయి. తెల్ల పిండి సాధారణంగా ఎక్కువగా ప్రాసెస్ చేయబడుతుంది. దాని నుండి తయారైన వస్తువులు ఫైబర్ లేకపోవడం వల్ల తృణధాన్యాల(Cereals) కంటే మీ రక్తంలో చక్కెరను పెంచుతాయి. మాంసం వంటి వాటిని తీసుకోవడం తగ్గించాలి.

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...