అక్షరటుడే, కామారెడ్డి:Dharmacharya Darshan Yatra | రామరాజ్యం సంస్థ పేరిట తనకు బెదిరింపు ఫోన్లు చేస్తున్నారని ధర్మాచార్య దర్శన యాత్ర వ్యవస్థాపకులు పవన్ కుమార్ శర్మ(Pavan Kumar Sharma) తెలిపారు. శుక్రవారం ఆయన ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra)ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో చిలుకూరు అర్చకులు రంగరాజన్‌పై రామరాజ్యం సంస్థ పేరిట దాడులు చేస్తే సీఎం(CM)తో సహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఖండించాయని గుర్తు చేశారు. అందరితో పాటు తాను కూడా రంగరాజన్(Rangarajan)పై దాడిని ఖండించానని తెలిపారు. దాంతో సదరు సంస్థ ముఖ్యలు తరచూ ఫోన్లు చేస్తూ బెదిరిస్తున్నారని.. వాళ్లు చెప్పినట్లుగా చేయకపోతే తన యాత్రను అడ్డుకుంటామని చెబుతున్నారన్నారు. తక్షణమే అతడిపై చర్యలు తీసుకోవాలని పిర్యాదులో పేర్కొన్నారు.