అక్షర టుడే, ఇందూరు: Deputation | పాఠశాలలు ప్రారంభమైన తొలిరోజే ధర్పల్లి మండలంలో (Dharpalli mandal) అక్రమ డిప్యూటేషన్ వేశారు. మండలంలోని దుబ్బాక జిల్లా పరిషత్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయురాలిని ఏకంగా ప్రధానోపాధ్యాయురాలే మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ డీబీ తండాకు డిప్యూటేషన్ వేశారు. రాష్ట్ర విద్యాశాఖ జులై 15 వరకు ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలని ఆదేశించింది. కానీ తొలిరోజే ఇలా చేయడంపై చర్చనీయాంశమైంది. గతేడాది సంబంధిత టీచర్ కు డిప్యూటేషన్ వేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. కానీ అప్పుడు చేయకుండా ఈ విద్యా సంవత్సరం చేశారు.
