ePaper
More
    Homeజిల్లాలుకరీంనగర్Collector Pamela Satpathi | మహిళ సంక్షేమమే 'శుక్రవారం సభ' ధ్యేయం

    Collector Pamela Satpathi | మహిళ సంక్షేమమే ‘శుక్రవారం సభ’ ధ్యేయం

    Published on

    అక్షరటుడే, కరీంనగర్ : Collector Pamela Satpathi | మహిళల సంక్షేమమే ‘శుక్రవారం సభ’ (Friday meeting) ప్రధాన ధ్యేయమని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి (Collector Pamela Satpathi) అన్నారు. కరీంనగర్ లోని దుర్గమ్మగడ్డ అంగన్ వాడీ కేంద్రంలో (Anganwadi Center) మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్ వాడీ కేంద్రాల్లో చదువుతో పాటు పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారన్నారు. నూతన సిలబస్ తో, ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్లతో అంగన్ వాడీల్లో బోధిస్తున్నామని పేర్కొన్నారు. పిల్లలు ఎత్తుకు తగిన బరువుతో ఆరోగ్యంగా ఉండేలా అంగన్ వాడీ కార్యకర్తలు (Anganwadi workers) శ్రద్ధ తీసుకుంటారని తెలిపారు. మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలందరినీ అంగన్ వాడీలకు పంపించాలని సూచించారు. అనంతరం చిన్నారులకు కోడిగుడ్డు బిర్యానీతో మధ్యాహ్నం భోజనం వడ్డించారు.

    అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు (government hospitals), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రత్యేక క్యాంపుల్లో ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా మహిళలకు 50 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ (Municipal Commissioner Prapul Desai), జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, సీడీపీవో సబిత, వైద్యాధికారులు సనా, సూపర్ వైజర్ రేణుక, ఆర్పీలు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

    More like this

    Crop Damage | నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుంది

    అక్షరటుడే, డోంగ్లి: Crop Damage | ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మండలంలో 3,200 ఎకరాల్లో పంట...

    Movements and Protests | రెండు దేశాలు.. రెండు ఉద్యమాలు.. ప్రభుత్వాలను కూల్చేసిన నిరసనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movements and Protests | రెండు దేశాల్లో రగిలిన రెండు ఉద్యమాలు అక్కడి ప్రభుత్వాలను...

    Kamareddy | ఊపిరితిత్తులలో ఇరుక్కున్న శనగ గింజ.. చికిత్స చేసి తొలగించిన వైద్యులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని శ్వాస చెస్ట్ అండ్ జనరల్ ఆస్పత్రిలో (Swasah Chest and General...