అక్షరటుడే, వెబ్డెస్క్ : Army Chief | పహల్గామ్ ఉగ్రదాడి pahalgam terror attack నేపథ్యంలో భారత ఆర్మీ ఛీప్ ఉపేంద్ర ద్వివేది Indian Army Chief Upendra Dwivedi శుక్రవారం జమ్మూ కశ్మీర్లో పర్యటించారు. శ్రీనగర్లో srinagar ఆర్మీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అలాగే పహల్గామ్లో ఉగ్ర దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్తో Lieutenant Governor భేటీ అయి ఉగ్రదాడి అనంతరం చేపట్టిన చర్యలను వివరించారు. ఆయన పర్యటన సందర్భంగా అధికారులతో మాట్లాడుతున్న చిత్రంలో కురుక్షేత్రంలో అర్జునుడి రథాన్ని నడుపుతున్న శ్రీకృష్ణుడి ఫొటో ఉంది. దీంతో పాకిస్తాన్ pakistanకు హెచ్చరికలు పంపడానికే ఈ ఫొటో పెట్టినట్లు తెలుస్తోంది. ఇది ధర్మ యుద్ధమని తెలిపేలా ఆ ఫొటోతో సందేశం పంపినట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Army Chief | మెరుపు దాడి తప్పదా..
ఉగ్రదాడితో ఆగ్రహంగా ఉన్న భారత్ ఏ క్షణామైనా పాక్పై మెరుపు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పీవోకేలో 17 ఉగ్రవాద శిబిరాలు Terrorist camps ఉన్నట్లు గుర్తించారు. భారత్లో చొరబడి దాడులు చేయడానికి అక్కడ శిక్షణ ఇస్తున్నారని, 37 లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ మళ్లీ సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో భారత త్రివిద దళాలు ఇప్పటికే అప్రమత్తం అయ్యాయి.