అక్షరటుడే, ఇందూరు : Sri Chaitanya School | నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో నేషనల్ మార్ట్ వెనకాల నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ చైతన్య (Sri Chaitanya School) బ్రాంచ్‌కు విద్యా శాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేవని రూరల్ మండల ఎంఈవో సేవ్లా (Rural Mandal MEO Savela) తెలిపారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను ఈ పాఠశాలలో చేర్పించవదని సూచించారు. అనుమతి ఉన్న పాఠశాలలో విద్యార్థులను జాయిన్ చేయాలన్నారు.