అక్షరటుడే, వెబ్డెస్క్:Hyderabad | జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి(Terror Attack) నేపథ్యంలో భారత్(India) పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పాకిస్తానీయుల వీసాలు రద్దు చేసింది. దీంతో ఆ దేశస్తులు వెంటనే తిరిగి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా(Union Home Minister Amit Shah) నేడు దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లోని పాకిస్తాన్ ప్రజలను పంపించేయాలని చెప్పారు.
Hyderabad | హైదరాబాద్లో ఎంత మంది ఉన్నారంటే..
అమిత్ షా(Amith Shah) నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(State Chief Minister Revanth Reddy)కి ఫోన్ చేశారు. హైదరాబాద్‌లోని 200 మందికి పైగా పాకిస్థానీయులు వెంటనే తిరిగి పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్(High Alert) ప్రకటించింది. పాకిస్తాన్కు చెందిన ప్రజలను వెనక్కి పంపేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.