ePaper
More
    HomeజాతీయంMaharashtra | మహారాష్ట్రలో మరాఠీ భాష వివాదం.. ఆర్‌పీఎఫ్ అధికారులను మరాఠీలో మాట్లాడమని ప్రజల ఒత్తిడి

    Maharashtra | మహారాష్ట్రలో మరాఠీ భాష వివాదం.. ఆర్‌పీఎఫ్ అధికారులను మరాఠీలో మాట్లాడమని ప్రజల ఒత్తిడి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Maharashtra | ఈ మ‌ధ్య భాష విష‌యంలో ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకుంటుండడం మ‌నం చూస్తూనే ఉన్నాం. క‌మ‌ల్ హాస‌న్(Kamal Haasan) క‌న్న‌డ భాష‌ని త‌క్కువ చేస్తూ కామెంట్స్ చేయ‌డంతో క‌న్న‌డిగులు భ‌గ్గుమ‌న్నారు. క‌ర్ణాట‌క‌లో క‌మ‌ల్ న‌టించిన థ‌గ్ లైఫ్ చిత్రాన్ని ఆడ‌నివ్వ‌లేదు కూడా. ఇక థ‌గ్ లైఫ్ చిత్రం ఫ్లాప్ కావ‌డం, క‌మ‌ల్ హాసన్ సైలెంట్ కావ‌డంతో క‌న్న‌డిగులు సైలెంట్ అయ్యారు. ఇక మహారాష్ట్రలో భాషాపరమైన ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. ఇటీవల ముంబయి సహా పలు రైల్వే స్టేషన్లలో, రైల్వే పరిరక్షణ బలగం(RPF) సిబ్బందిని మరాఠీ భాషలో(Marathi language) మాట్లాడాలని స్థానికులు ఒత్తిడి చేయడం పెద్ద దుమారం రేపుతోంది.

    Maharashtra | ఒత్తిడి ప‌నికి రాదు..

    విశ్వ‌స‌నీయ వ‌ర్గాల‌ సమాచారం ప్రకారం.. పలు చోట్ల ప్రయాణికులు, స్థానికులు ఆర్‌పీఎఫ్ ఉద్యోగులతో(RPF employees) జరిగిన సంభాషణల్లో హిందీ లేదా ఇంగ్లిష్‌కు బదులుగా మరాఠీ మాట్లాడాలని డిమాండ్ చేస్తూ వీడియోలు తీయడం, కొన్ని సందర్భాల్లో వారిపై నిందలు మోపడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇది ప్రాంతీయ భాషా అస్థిత్వంపై ఉద్యమమా, లేక అధికార భాష అనుసరణలోని లోటుపాటులా అన్న దానిపై చర్చ మొదలైంది. రైల్వే శాఖ అధికార వర్గాలు(Railway Department authorities) ఈ ఘటనలపై స్పందిస్తూ, “ఆర్‌పీఎఫ్ (RPF) సిబ్బంది దేశ వ్యాప్తంగా విధులు నిర్వర్తించేవారు. వారు హిందీ మరియు ఇంగ్లిష్ భాషల్లో శిక్షణ పొందారు. అవసరమైన సందర్భాల్లో స్థానిక భాషలలోనూ మాట్లాడే ప్రయత్నం చేస్తారు” అని వెల్లడించారు.

    మరోవైపు, కొన్ని మరాఠీ అభిమాన సంఘాలు మరాఠీని (Marathi) అధికారిక భాషగా గుర్తించి, అన్ని ప్రభుత్వ రంగ శాఖలలో మరాఠీని తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనలపై మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra Government), కేంద్ర హోం శాఖ(Union Home Ministry) దృష్టి సారించినట్లు తెలుస్తోంది. భాషపై ప్రేమ ఉన్నా, సేవల లోపం కలగకుండా సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...