ePaper
More
    HomeజాతీయంKA Paul | మోదీ రిటైర్మెంట్ ప్రకటించి.. అమిత్ షాకు ప్రధాని పగ్గాలు అప్పగించాలి.. కేఏ...

    KA Paul | మోదీ రిటైర్మెంట్ ప్రకటించి.. అమిత్ షాకు ప్రధాని పగ్గాలు అప్పగించాలి.. కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: KA Paul | ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ (KA paul) ఇటీవ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితం భారత్, పాకిస్తాన్ మధ్య యుద్దాన్ని ఆపుతానని పాల్ అన్నారు. యుద్ధాన్ని ఆపే శక్తి తనకే ఉందన్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా భారత్, పాకిస్తాన్ మధ్య చర్చలు జరుపుతున్నట్లు కేఏపాల్ తెలిపారు. ఇటీవల రహస్యంగా మూడు రోజుల పాటు అమెరికాలో ఉన్న అగ్రనేతలను కలిసినట్లు చెప్పారు. ప్రధాని మోదీ సీఎంగా ఉన్న టైంలో 2002లో తాను పాకిస్తాన్ వెళ్లినట్లు గుర్తుకు చేశారు. భారత్ కేవలం టెర్రరిస్టులను మాత్రమే టార్గెట్ చేస్తోంది. ఏపీ మాజీ సీఎం జగన్ అసలు క్రిస్టియన్ కాదు, జగన్ చిన్నజీయర్ స్వామి భక్తుడు తన ఆశీర్వాదం తీసుకోలేదు కాబట్టే గత ఎన్నికల్లో జగన్ చిత్తుగా ఓడిపోయారు. పాస్టర్ ప్రవీణ్​ను హత్య చేశారనే కోణంలో దర్యాప్తు చేయాలని హైకోర్టును కోరాం అని కేఏపాల్ అన్నారు.

    KA Paul | పాల్ సంచ‌ల‌న కామెంట్స్..

    ఆర్డీటీపై బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ Pawan Kalyan కుట్రలు చేస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు. ఆర్డీటీకి ఎఫ్​సీఆర్​ఏ రెన్యూవల్ జరగకుండా ఆపారన్నారు. కానీ తాను ఆర్డీటీకి ఎఫ్​సీఆర్​ఏ తీసుకొస్తా.. ఆపే ధైర్యం ఎవరికుందని పాల్ ప్రశ్నించారు. ఆర్డీటీ ప్రతినిధులు తనను కలిసిన 30రోజుల్లో ఎఫ్​సీఆర్​ఏ తీసుకొస్తానని తెలిపారు. తిరుమల లడ్డూ వివాదం తీసుకొచ్చి హిందువులు, క్రిస్టియన్ల మధ్య గొడవలు సృష్టించారంటూ సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​లు హిందువులు, క్రిస్టియన్ల మధ్య గొడవలు సృష్టించారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ తొత్తులు అని కేఏ పాల్ అన్నారు.

    ఇలా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్న కేఏ పాల్ తాజాగా సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ‘ప్రధాని మోదీ(Prime Minister Modi)కి వయసై పోయింది.. వెంటనే రాజీనామా చేయాలి’ అని కేఏ పాల్ డిమాండ్ చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నిబంధనల ప్రకారం 75 ఏళ్లు నిండిన మోదీ.. రిటైర్మెంట్(Modi retirement) ప్రకటించి, అమిత్ షా Amit Shahకు ప్రధాని పగ్గాలు అప్పగించాలి అని వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందంటూ అనుమానం వ్యక్తం చేశారు పాల్. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో(Ahmedabad plane crash) 241 మంది ప్రయాణికులు చనిపోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనను చూస్తే ఉగ్రవాదుల దాడిగా అనుమానం వ్యక్తమవుతోందన్నారు. తనకు ఉన్న గ్లోబల్ ట్రావెలింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో చెబుతున్నానని.. తనకు సొంతంగా ఎయిర్‌క్రాఫ్ట్ ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...