ePaper
More
    HomeతెలంగాణWeather Updates | రానున్న ఐదు రోజులు భారీ వర్ష సూచన

    Weather Updates | రానున్న ఐదు రోజులు భారీ వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నాలుగు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. దీంతో వాతావరణం చల్లబడింది. తెలంగాణ(Telangana)లో రానున్న ఐదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు(Meteorological Department) హెచ్చరించారు.

    దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడుతున్నట్లు తెలిపారు.

    Weather Updates | మరి కొద్దిసేపట్లో వర్షం

    రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సిద్దిపేట, మెదక్, నల్గొండ, సూర్యాపేట, ములుగు, భూపాలపల్లి, వనపర్తి, నాగర్​ కర్నూల్, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో సాయంత్రం వాన పడే ఛాన్స్​ ఉందన్నారు.

    Weather Updates | హైదరాబాద్​లో దంచికొట్టిన వాన

    హైదరాబాద్​లోని(Hyderabad) పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. బషీర్​బాగ్​, అబిడ్స్​, కోఠి, నాంపల్లి, హిమాయత్​నగర్​, చైతన్యపురి, సరూర్​నగర్​, సైదాబాద్​, చంపాపేట్​, అమీర్​పేట్​, ఎస్సార్​ నగర్​, ఎర్రగడ్డ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్​, బంజారాహిల్స్​, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం కూడా హైదరాబాద్​లో వర్షం కురిసే అవకాశం ఉంది.

    More like this

    Urban Company IPO | అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ రెస్పాన్స్.. గంటల వ్యవధిలోనే ఓవర్ సబ్ స్క్రిప్షన్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Urban Company IPO | యాప్ ఆధారిత సేవలు అందించే అర్బన్ కంపెనీ ఐపీవోకు...

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....