అక్షరటుడే, వెబ్‌డెస్క్: indus water treaty | పహల్గామ్ ఉగ్రదాడి pahalgam terror attack నేపథ్యంలో పాకిస్తాన్(pakistan)కు నీళ్లు వెళ్లకుండా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే పాక్ నీళ్లు ఆపేస్తే.. ప్రాణాలు తీస్తామని లష్కరే ఉగ్రవాది హఫీజ్ సయీద్ Hafiz Saeed అన్నారు. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో హఫీజ్ సయిద్ మాట్లాడుతూ.. పాక్‌కు నీరు ఆపేస్తే.. మోదీ శ్వాస ఆపేస్తానని అన్నారు. కశ్మీర్ kashmir నదులలో రక్తం పారిస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నీళ్లు బంద్ చేస్తే తాము ఖాళీ చేతులతో కూర్చోబోమని పెద్ద యుద్ధమే చేస్తామన్నారు.
కాగా.. హఫీజ్ సయీద్ లష్కరే తోయిబా Lashkar-e-Taiba వ్యవస్థాపకుడు, 2008 ముంబై దాడులకు సూత్రధారి. దీంతో హఫీజ్ సయీద్‌ను ఐక్యరాజ్య సమితి, అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాయి. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక కూడా హఫీజ్ సయీద్ హస్తం ఉన్నట్లు భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.