ePaper
More
    Homeఅంతర్జాతీయంAMA | అమెరికన్​ మెడికల్ అసోసియేషన్​ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి

    AMA | అమెరికన్​ మెడికల్ అసోసియేషన్​ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: AMA | అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (AMA) అధ్యక్షుడిగా భారతీయ సంతతికి చెందిన డాక్టర్ బాబీ ముక్కామల(Dr. Bobby Mukkamala) ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికాలో అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన వైద్య సంస్థ అయిన ఏఎంఏకే 180వ అధ్యక్షుడిగా ఆయన బాబీ ఎన్నికయ్యారు.

    అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. US ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. దానిని మెరుగుపరుస్తామని ప్రతిజ్ఞ చేశారు. రోగులకు తగినంత ఆరోగ్య కవరేజ్(Health coverage) కోసం పోరాటం కొనసాగించడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు.

    AMA | ఆంధ్రప్రదేశ్​ మూలాలు

    ఆంధ్రప్రదేశ్​(Andhra Pradesh)లోని కృష్ణ జిల్లా నుంచి అమెరికాకు వలస వెళ్లిన తల్లిదండ్రులకు బాబీ ముక్కామల(Bobby Mukkamala) జన్మించారు. ఏఎంఏ అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో బాబీ మాట్లాడుతూ.. తన తాతకు 30 ఎకరాల భూమి ఉండేదని చెప్పారు. దానిని అమ్మి ఆయన తన పిల్లలను చదివించారన్నారు. తన తండ్రి పట్టభద్రుడు అయ్యే సరికి భూమి అంతా పోయిందని చెప్పారు. కాగా బాబీ తండ్రి రేడియాలజిస్ట్, తల్లి పిల్లల వైద్య నిపుణురాలు. బాబీ ముక్కామల మిచిగాన్ విశ్వవిద్యాలయం(Michigan University) నుంచి వైద్య పట్టా పొందారు. చికాగోలోని లయోలా విశ్వవిద్యాలయ వైద్య కేంద్రంలో తన రెసిడెన్సీని పూర్తి చేశారు. అతని భార్య నీతా కులకర్ణి గైనకాలజిస్ట్. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

    More like this

    ACB Raids | ఏసీబీ అధికారుల దూకుడు.. పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి...

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...