ePaper
More
    HomeజాతీయంDNA Test | విమాన ప్రమాద మృతుల గుర్తింపులో కీలకంగా మారిన డీఎన్​ఏ టెస్ట్..​ అసలు...

    DNA Test | విమాన ప్రమాద మృతుల గుర్తింపులో కీలకంగా మారిన డీఎన్​ఏ టెస్ట్..​ అసలు ఈ పరీక్ష ఏంటి.. ఎలా చేస్తారో తెలుసా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: DNA Test | అహ్మదాబాద్​ విమాన ప్రమాదం(Ahmedabad plane crash)లో 265 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. లండన్​ వెళ్తున్న విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్​(BJ Medical College Hostel) భవనాన్ని ఢీకొని పేలిపోయింది. ఈ ఘటనలో విమానంలోని 241 మందితో పాటు బీజే మెడికల్ కాలేజీ విద్యార్థులు 24 మంది చనిపోయారు. అయితే విమానం పేలిపోవడంతో మృతదేహాలు గుర్తు పట్టలేనట్లుగా మారాయి. దీంతో అధికారులు డీఎన్​ఏ పరీక్ష (DNA Test) చేశాక మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. ఈ మేరకు డీఎన్​ఏ పరీక్షలు చేస్తున్నారు. మృతుల గుర్తింపులో కీలకంగా మారిన డీఎన్​ఏ టెస్ట్​ అంటే ఏమిటి.. ఎలా చేస్తారో తెలుసుకుందాం..

    DNA Test | డీఎన్​ఏ పరీక్ష అంటే..

    డియోక్సిరి బోన్యూక్లిక్ యాసిడ్ (DNA) తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది. డీఎన్​ఏ పరీక్షలు ఏదైనా జన్యుపరమైన రుగ్మతలను గుర్తించడానికి, చట్టపరమైన ప్రయోజనాల కోసం పితృత్వాన్ని నిరూపించడానికి చేస్తారు. అలాగే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మృతదేహాలు అప్పగించడానికి కూడా డీఎన్​ఏ పరీక్ష చేస్తారు. డీఎన్​ఏ అంటే తల్లిదండ్రులిద్దరి నుంచి వారి పిల్లలకు సమాచారాన్ని చేరవేసే జన్యు సంకేతం.

    DNA Test | డీఎన్​ఏ పరీక్ష ఎప్పుడు చేస్తారు

    డీఎన్​ఏ పరీక్ష (DNA Test) ఉద్దేశ్యం వ్యక్తులకు వారి జన్యు నిర్మాణం గురించి సమాచారాన్ని అందించడం. ఈ సమాచారాన్ని వంశపారంపర్యతను నిర్ణయించడం, ఆరోగ్య ప్రమాదాలు, సంభావ్య కుటుంబ సభ్యులను గుర్తించడం వంటి వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. డీఎన్​ఏ పరీక్షలను సీక్వెన్సింగ్, మైక్రోఅరే విశ్లేషణ, PCR వంటి వివిధ పద్ధతులను ఉపయోగించి చేస్తారు.

    DNA Test | ఎలా చేస్తారు

    సాధారణంగా ప్రమాదాల్లో మరణించిన వారి మృతదేహాల నుంచి డీఎన్​ఏ సేకరిస్తారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యుల నుంచి డీఎన్​ఏ సేకరిస్తారు. ఇలా ఎవరి డీఎన్​ఏ అయితే సరిపోతాయో వారికి మృతదేహాలు అప్పగిస్తారు. పెద్ద మొత్తంలో ప్రజలు చనిపోయి, మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా మారినప్పుడు అధికారులు డీఎన్​ఏ పరీక్ష ద్వారా వారిని గుర్తిస్తారు. డీఎన్​ఏ నమూనా(DNA sample) సేకరించిన తర్వాత, దాని జన్యు నిర్మాణాన్ని నిర్ణయించడానికి దానిని విశ్లేషిస్తారు.

    More like this

    Banswada | ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయం : పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam...

    Nepal | 11 ఏళ్ల బాలిక వ‌ల్ల నేపాల్ ప్ర‌భుత్వం కూలిందా.. ఉద్యమం ఉద్రిక్త‌త‌కి దారి తీయడానికి కార‌ణం ఇదే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌లో జెన్‌ జెడ్‌ యువత ప్రారంభించిన ఉద్యమం ఊహించని రీతిలో ఉద్రిక్తతకు...

    Nara Lokesh | నేపాల్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం.. సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్నిర‌ద్దు చేసుకున్న నారా లోకేష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | నేపాల్‌(Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న తెలుగువారిని...