అక్షరటుడే, వెబ్‌డెస్క్: Emergency Landing | ఆర్మీ హెలికాప్టర్(Army helicopter) సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ఘటన పంజాబ్లోని పఠాన్కోట్లో చోటు చేసుకుంది. పఠాన్‌కోట్ జిల్లా(Pathankot district)లోని నంగల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే హాలెడ్ గ్రామంలో భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాప్టర్(Apache helicopter) అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక సమస్యలతో పైలెట్ అత్యవసరంగా ల్యాండ్(Land) చేసినట్లు తెలిసింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
